Indraja: నా కెరీయర్ లో క్రిటికల్ సిచువేషన్ అదే.. డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడ్డాను: ఇంద్రజ

Indraja: నటి ఇంద్రజ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి, జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఆదివారం ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ఇంద్రజ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ ఆదివారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

Indraja: నా కెరీయర్ లో క్రిటికల్ సిచువేషన్ అదే.. డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడ్డాను: ఇంద్రజ

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ వీడియో ద్వారా ఇంద్రజను ప్రశ్నిస్తూ.. మీ జీవితంలో క్రిటికల్ సిచువేషన్ ఏది అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఇంద్రజ సమాధానం చెబుతూ 1998 లో ఇంద్రజ తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేసి ఒక ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అదే సమయంలోనే తన తల్లికి కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని వెంటనే సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు.చేతిలో రూపాయి కూడా లేదు అమ్మకు సర్జరీ ఎలా చేయాలో దిక్కు తెలియడం లేదనీ ఇంద్రజ తెలిపారు.

Indraja: నా కెరీయర్ లో క్రిటికల్ సిచువేషన్ అదే.. డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడ్డాను: ఇంద్రజ

ఆ సమయంలో నేను పనిచేస్తున్న కంపెనీలో ఇచ్చిన రెండు చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. ఎవరిని అడగాలో తెలియని అయోమయంలో ఉన్నాను. ఆ సమయంలో నా నగలని తాకట్టు పెట్టి అలా ఏదో చేసి అమ్మకు ఆపరేషన్ చేయించాము. అలా అమ్మను బ్రతికించు ఉన్నామని అయితే ప్రస్తుతం తన తల్లి తనకు దూరం అయ్యారని ఇంద్రజ తన కన్నీటి కష్టాలను కార్యక్రమం ద్వారా తెలియజేశారు.

మనీ సెకండరీ

తన జీవితంలో చాలా క్రిటికల్ సిచువేషన్ అదేనని అప్పటి నుంచి తన లైఫ్ లో మనీ అనేది సెకండరీగా మారిపోయిందని ఈమె వెల్లడించారు. నాకు ఈ సిచువేషన్ ఎదురైన తర్వాత ఎంత బాధ పడ్డానో నాకే తెలుసు అందుకే ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే తన దగ్గర డబ్బు ఉంటే ఏ మాత్రం ఆలోచించకుండా వారికి ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.