Sudigaali Sudheer : మాంత్రికుడిగా తన కెరీర్ ని మొదలుపెట్టాడు సుధీర్. అయితే జబర్దస్త్ అనే టీవీ ప్రోగ్రాం ద్వారా తెలుగు బుల్లితెర మీద కనిపించాడు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ అంటే ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి ప్రోగ్రామ్స్ తో అభిమానులకు చేరువ అయ్యాడు.టీవీ ప్రోగ్రామ్స్ లోనే కాకుండా అపుడప్పుడు సినిమాలు కూడా చేస్తుంటారు. సుడిగాలి సుధీర్ కు సోషల్ మీడియా లో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అయన చేసే స్కిట్ లకి, అయన చేసే స్పెషల్ ప్రోగ్రామ్స్ కి యూ ట్యూబ్ లో వ్యూస్ అధికంగా ఉంటాయి.అయితే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ని వీడుతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయ్.
సుధీర్ జబర్దస్త్ కి గుడ్ బై చెప్తున్నాడా…..
ప్రస్తుతం సుడిగాలి సుధీర్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లో మాత్రమే కనిపిస్తున్నారు. ఢీ షో లో ఇపుడు సుధీర్ కనిపించట్లేదు. అలాగే స్పెషల్ ప్రోగ్రామ్స్ లో కూడా సుధీర్ సందడి లేదు. దీంతో అభిమానులలో నిరాశ కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కి హోస్ట్ గా వ్యవహారిస్తున్న సుధీర్ తన పూర్తి బాధ్యతలను నెరవేరుస్తున్నాడు అనడం లో సందేహం లేదు. అయితే జబర్దస్త్ తో అభిమానులను అలరించడమే కాకుండా వేరే టీమ్స్ లో కూడా కనిపించి సందడి చేస్తుంటారు. జబర్దస్త్ అంటే సుధీర్, సుధీర్ అంటే జబర్దస్త్ అనేలా అభిమానులలో పేరు సంపాదించారు. అలాంటిది సుధీర్ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పి శ్రీదేవి డ్రామా కంపెనీ లో మాత్రమే కొనసాగుతారు అన్న వార్తలు వస్తున్నాయ్.
ప్రస్తుతం ఈ విషయం అభిమానులను కలవరపెడుతోంది. ఇప్పటికే ఆది ఇంకా పలువురు కమెడియన్లు జబర్దస్త్ ను వీడిన సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీ గా వున్న సుధీర్ జబర్దస్త్ ను కొనసాగించలేక పోతున్నారట. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఈ సంవత్సరం చివిరికి అయిన జబర్దస్త్ కు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇదే నిజం అయితే జబర్దస్త్ కు భారీ నష్టం తప్పదు అంటున్నారు సినీ వర్గాలు. అయితే ఇందులో నిజం ఎంత ఉందొ సుధీర్ స్పందిస్తే అభిమానుల అనుమానలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…