Elon Musk: అంగారక గ్రహంపై మానవుడు కాలు మోపేది ఆ రోజే..ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Elon Musk: రానున్న రోజుల్లో అంగారక గ్రహానికి మానవులను పంపించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇది ఎప్పుడనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటికే మార్స్ గ్రహంపైకి నాసా, యూరోపియన్ యూనియన్, చైనా స్పెస్ ఎజెన్సీలు, ఇస్రో వంటివి ఇప్పటికే శాటిలైట్లను పంపించాయి.
నాసా వంటివి రోవర్లను కూడా పంపింది. గతంలో క్యూరియాసిటీ రోవర్ ను పంపించింది. ఇటీవలనే నాసా పర్సువరెన్స్ రోవర్ ను మార్స్ పైకి విజయవంతంగా పంపించింది. అయితే తాజాగా ఎలాన్ మస్క్.. తన స్పెస్ ఎక్స్ సంస్థ నుంచి వచ్చే 5 ఏళ్లలో మార్స్ పైకి తప్పకుండా.. మనిషిని పంపిస్తామని అన్నారు.
‘‘రాబోయే ఐదేళ్లలో తప్పకుండా మనిషిని మార్స్ పైకి పంపిస్తాం. ఎదైనా వరెస్ట్ సినారియో ఎదురైతే పదేళ్లు పట్టొచ్చు. ఈ పదేళ్లలో మనిషిని మార్స్ పైకి పంపించడం ఖాయమని.. అందుకు నాది బాధ్యత’’ అని ఎలాన్ మస్క్ అన్నారు. పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు మస్క్.
ఇప్పటికే స్పెస్ ఎక్స్ రాకెట్ల ద్వారా హెవీ పెలోడ్ ను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నాడు. డ్రాగన్ క్రూ ద్వారా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటికే నాసాకు సంబంధించిన శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశ పెట్టాడు. ప్రస్తుతం స్టార్ షిప్ లాంటి హెవీ వెహికిల్ ను సిద్దం చేస్తున్నాడు. స్పెస్ ఎక్స్ సంస్థ రాకెట్లకు ఉపయోగించే బూస్టర్లను తిరిగి వినియోగించేలా మళ్లీ నెలపైకి వచ్చేలా.. రూపొందించారు. టెస్లా సంస్థ ద్వారా ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాడు ఎలాన్ మస్క్.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…