General News

Milk Jewellery: తల్లిపాలతో జువెలరీ తయారీ.. పెరుగుతున్న డిమాండ్..!

Milk Jewellery: కొందరికి చిన్నతనంలో చేసిన కొన్ని చిలిపి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. వాటి తాలూకా ఏమైనా ఫొటోలు ఉంటే.. భద్రంగా దాచుకుంటారు. అవి ఎప్పటికీ గుర్తుండి పోవాలి అని.. ఇంట్లోనే ఓ చిన్న పెట్టెలల్లో దాచుకుంటారు. అయితే అమ్మతనం జ్ఞాపకాల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అనుకునే వాళ్లకు.. ఇక్కడ చెప్పే ఈ న్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Milk Jewellery: తల్లిపాలతో జువెలరీ తయారీ.. పెరుగుతున్న డిమాండ్..!

తల్లిపాలతో జువెలరీని తయారు చేస్తున్నారు ఇద్దరు ఆర్టిస్టులు. దాని గురించి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన ఆర్టిస్ట్​ ప్రీతి విజయ్​కి చిన్నప్పటి నుంచి ఆర్ట్, క్రాఫ్ట్ వర్క్​ అంటే ఇష్టం. ఆమె డిగ్రీ చదివిన​ తర్వాత పాలిమర్​, మట్టి కలిపి తయారుచేసిన బొమ్మలు అమ్మడం మొదలుపెట్టింది. అయితే ఆమె దగ్గరకు వచ్చిన కొందరు తల్లిపాలతో తయారు చేసిన జువెలరీ కావాలని అడిగేవారట.

Milk Jewellery: తల్లిపాలతో జువెలరీ తయారీ.. పెరుగుతున్న డిమాండ్..!

దాంతో అప్పటినుంచి ‘మొమ్మాస్​ మిల్కీ లవ్​’ పేరుతో రకరకాల డిజైన్లలో ఉన్న ఉంగరాలు, చెవి కమ్మలు, పెండెంట్స్​ అమ్ముతోంది. అయితే ఆ మెటీరియల్, డిజైన్లను బట్టి ఆమె వాటి ధరను రూ.వెయ్యి నుంచి రూ.4 వేల లోపు ఫిక్స్ చేసింది. ఇలా ఆమె జువెలరీని.. అమెరికాకు చెందిన సారా కాస్టిల్లో ఇన్ స్టాగ్రామ్ లో చూసింది. దీంతో ఆమె కూడా ఆ బిజినెస్ లోకి రావాలనిపించడంతో.. ఆమెను సంప్రదించి వివరాలను కనుక్కోంది.


ధర 60 నుంచి 150 డాలర్లు..

ఎలా తయారు చేస్తారో తెలుసుకొని.. విజయవంతంగా..ఈ ఏడాది మార్చిలో ‘కీప్​సేక్​స్​ బై గ్రేస్​’ అనే కంపెనీ పెట్టింది. ధరను 60 నుంచి 150 డాలర్లకు ఫిక్స్ చేసింది. ఇలా వీళ్లిద్దరూ పాపులర్ అయ్యారు. వీటిని ఎలా తయారు చేస్తారంటే.. తల్లిపాలని ఎండలో ఉంచి.. వాటిని బాగా ఇగుర్చుతారు. దాంతో పాలు పిండిలా మారతాయి. ఆ పిండిలో రెసిన్​ అనే జిగురు పదార్థాన్ని కలిపి.. రాయిగా మారుస్తారు. తర్వాత కస్టమర్లు కోరిన డిజైన్​లో పెండెంట్, రింగ్స్​ తయారుచేసి అందిస్తారు. వీటికి ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago