Ancor Lasya: బుల్లితెరపై యాంకర్ లాస్య ప్రయాణం ఓ ప్రతేకమైనది. ఆమె మొదట తన కెరీర్ ను సంథింగ్ స్పెషల్ అనే షోలో మొదలు పెట్టింది. ఆ తర్వాత రవితో కలిసి ఎన్నో షోలను నడిపించింది. అప్పట్లో వారిద్దరు కలిసి ఏదైనా షోలో యాంకరింగ్ చేశారంటే అంతే ఇక.. ఆ షో టీఆర్పీ రేటింగ్ లో దూసుకుపోయేది.
ఇలా వాళ్లిద్దరు లవ్ లో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వారు తమ జీవిత భాగస్వాములను ఎంచుకొని.. జీవితంలో స్థిరపడ్డారు. తర్వాత లాస్య బుల్లితెరపై ఎక్కడా కనిపించలేదు. మళ్లీ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ఉద్దేశ్యంతో ఆమె బిగ్ బాస్ 4లో అడుగుపెట్టింది.
తనదైన ఆట, మాట తీరుతో అట్రాక్ట్ చేసిన ఆమె.. బయటకు వచ్చిన తర్వాత కొన్ని ప్రోగ్రాంలో కనిపించింది. రవితో మళ్లీ షోలు చేయడం మొదలు పెట్టింది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్ లో కూడా వీళ్లిద్దరు కలిసి స్కిట్లు చేయడంతో పాటు.. యాంకరింగ్ కూడా చేశారు. ఆ తర్వాత రవి బిగ్ బాస్ 5లోకి వెళ్లిన తర్వాత మళ్లీ.. దూరం అయ్యారు.
ఇక తాజాగా లాస్య క్యాష్ అనే ప్రోగ్రాంకు హాజరై.. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకుంటూ కన్నీటి పర్యతం అయ్యారు.గతంతో ఆమె ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు. ఓ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లగా.. ఓ వ్యక్తి తనతో పడుకోమని అడిగాడని ఆరోపించింది. ఫోన్ చేసి పచ్చిగా అడిగాడని.. తాను కుదరదు అని చెప్పడంతో.. నాతో పెద్ద పెద్ద యాంకర్లే పడుకున్నారు.. నువ్వెంత అంటూ అసభ్యకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈవెంట్ కోసం ఆమెరికా వెల్లిన వాళ్లు.. హోటల్ రూంకి వెళ్లిన తర్వాత కథ వేరే ఉంటదని.. ఈవిషయం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా వెల్లడైందని చెప్పింది. ఇలా కొంతమంది వ్యాపార వేత్తలు డబ్బులను ఎరగా చూపి.. ఇలా చేస్తున్నారని ఆరోపించింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…