General News

పెళ్లిలో కట్నంగా కిడ్నీ డిమాండ్ చేసిన మగ పెళ్లివారు ! ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు!

పాట్నా, జూన్ 10: మన దేశంలో వరకట్న నిషేధ చట్టం 1961లో వచ్చిందనేది కేవలం పుస్తకాల్లోనే ఉంది. చట్టం ఉన్నప్పటికీ, వరకట్నం అనేది సమాజంలో ఒక చీడపురుగులా కొనసాగుతూనే ఉంది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి పెళ్లిలోనూ ఇది ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంది. కట్నం కోసం మగ పెళ్లివారి డిమాండ్లు ఎలా ఉంటాయంటే.. కారు, ఇల్లు, బంగారం, డబ్బు.. ఇలా ఒకటేమిటి అన్నీ కావాలంటారు.

బీహార్‌లో జరిగిన ఈ ఘటన వింటే షాక్ అవుతారు. పెళ్లయిన తర్వాత భర్తకు మళ్లీ కట్నం కావాలని కోరిక పుట్టింది. భార్యను బైక్, డబ్బు, నగలు అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఏకంగా కిడ్నీనే కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు, భర్త, అత్తమామలు కలిసి ఆమెను కిడ్నీ కోసం చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. ఈ దారుణమైన సంఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగింది. బాధితురాలు దీప్తి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ముజఫర్‌పూర్‌లోని బోచాహా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న యువకుడితో 2021లో దీప్తికి పెళ్లయింది. పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించేవారు. పుట్టింటి నుంచి బైక్, డబ్బు తీసుకురావాలని ఒత్తిడి చేసేవారు. అయితే, దీప్తి భర్త కిడ్నీలు పాడయ్యాయని తెలిసిన తర్వాత అసలు కథ మొదలైంది. బైక్, డబ్బు తేలేకపోతే నీ కిడ్నీలలో ఒకటి నా కొడుక్కి దానం చేయాలని ఆమెను వేధించడం మొదలుపెట్టారు. దీప్తి కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఆమెను కొట్టి ఇంటి నుంచి గెంటివేశారు.

దిక్కుతోచని స్థితిలో దీప్తి తన పుట్టింటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత తన భర్త కిడ్నీ వ్యాధి గురించి తెలిసిందని, తనను కిడ్నీ దానం చేయాలని అత్తమామలు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. కానీ అది విఫలం కావడంతో భర్త విడాకులు ఇస్తానని చెప్పాడు. అయితే దీప్తి విడాకులకు అంగీకరించలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ కథనం మన సమాజంలో వరకట్నం అనే దురాచారం ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలియజేస్తుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

telugudesk

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

6 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

9 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago