Geetha Singh: ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కితకితలు హీరోయిన్… చివరికి ఇలా!
Geetha Singh: పలు తెలుగు సినిమాలలో లేడీ కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి గీతాసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పలు చిత్రాల్లో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించారు.
ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న గీతా సింగ్ వరుస అవకాశాలను అందుకొని ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతా సింగ్ తన కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాననే విషయాన్ని వెల్లడించారు.
ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని నమ్మి సుమారు 10 లక్షల వరకు చిట్టి వేసి ఉన్న డబ్బును మొత్తం పోగొట్టుకున్నానని ఈమె తెలిపారు. ఇలా అప్పటివరకు సంపాదించిన డబ్బు మొత్తం కోల్పోవడంతో దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయానని తెలిపారు.అదే సమయంలో తనకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోవడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వెంటాడయనీ తెలిపారు.
ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించానని అయితే తన సమస్యకు అది మాత్రమే పరిష్కారం కాదని, ఆ ఆలోచనను విరమించుకుని జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేశానని తెలిపారు.ఇక డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో విపరీతమైన ఆకలి వేయడంతో తినడానికి కూడా డబ్బులు లేక గుడి దగ్గర ప్రసాదం తిని ఆకలి తీర్చుకున్నాని ఈమె తెలిపారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…