Chiranjeevi:టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ తో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి. ఇలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో బి.గోపాల్ దర్శకత్వంలో మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబ్బరామిరెడ్డి నిర్మించిన ఏకైక చిత్రం స్టేట్ రౌడీ.
ఈ సినిమాలో చిరంజీవి సరసన భానుప్రియ, రాధా జంటగా నటించారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా 1989 మార్చి 23వ తేదీ ఈ సినిమా విడుదలయింది. ఈ సినిమా విడుదలైన మొదట్లో డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. ఈ విధంగా సినిమాకి ప్లాప్ టాక్ వచ్చిన కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది.
ఈ సినిమా నైజాంలో కోటి రూపాయల కలెక్షన్లను రాబట్టింది.మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమా విడుదలయ్యే సమయానికి బాలీవుడ్ హీరో అమితాబచ్చన్ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఈ సినిమా అమితా బచ్చన్ సినిమాలను మించి చిరంజీవి కలెక్షన్ లను సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా విడుదలైన తరువాత ట్రేడ్ గైడ్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ చిరంజీవి నటించిన సినిమా కలెక్షన్ల వివరాలను ప్రచురించి వెరీజ్ అమితాబ్? అని ప్రశ్నిస్తూ ఆర్టికల్ రాసింది. ఇక ఈ ఆర్టికల్ చదివిన హిందీ ప్రముఖులు సైతం వేరీజ్ అమితాబ్ అనే మాటను చూసి ఒక్క సారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ సినిమా చిరంజీవి కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచి వంద రోజుల వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్ కమల్ హాసన్ వంటివారు హాజరయ్యారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…