తమిళనాడుకు చెందిన కారు డ్రైవర్ గాయపడిన కోతికి తన నోటి ద్వారా గాలిని కోతి నోట్లో ఊది.. వానరం ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన తమిళనాడులోని పెరంబలూరులో చోటుచేసుకుంది. పెరంబలూర్‌లోని ఒడియం గ్రామంలో నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన కోతి ఆ ప్రాంతంలో వీధికుక్కలచే దాడి చేయబడింది. కోతిని వీధి కుక్కలు కరవడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
మండలంలో నివాసముంటున్న ప్రభు(42)కు అటుగా బైక్ పై వెళ్తుండగా అది తన కంట పడింది. దీంతో అతడు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా గాయపడిన కోతి చెట్టుకు వేలాడుతూ కనిపించింది. హుటాహుటిన ఆ కోతిని కిందకు దించిన సదరు వ్యక్తి దానికి తన నోటి ద్వారా గాలి అందించాడు. ఆ తర్వాత దాని ఛాతి మీద ఒత్తుతూ.. సీపీఆర్ చేశాడు.
సీపీఆర్ అంటే.. చనిపోయిన వెంటనే పది నిమిషాల లోపు ఛాతి మీద రెండు చేతులతో ఒత్తడం ద్వారా తిరిగి ప్రాణాలు పోసే అవకాశం ఉంటుంది. దాన్నే సీపీఆర్.. అని అంటారు. దీంతో ఆ కోతి ఊపిరి పీల్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా గాలి ఇచ్చిన తర్వాత ఆ కోతి నెమ్మదిగా కోలుకోవడం కనిపించింది. ఆ గాలి ఊదడంతో దానికి ఊపిరి ఆడటం మొదలై.. చిన్నగా స్పదించడం మొదలు పెట్టింది.
ఇక వెంటనే ప్రభు దానిని సమీపంలోని ప్రభుత్వ పశువైద్యుని వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కోతికి సరైన చికిత్స అందించిన తర్వాత అతడు.. దానిని ఎత్తుకొని.. తన కెమెరాలో బంధించాడు. ఇప్పుడు ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అతడిని సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తారు. పేరుకు తగ్గట్టుగానే అతడు కోతికి ప్రాణం పోసి దేవుడయ్యాడని నెటిజన్లు చెప్పుకొచ్చారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…