కేరళలోని ఇడుక్కికి చెందిన 24 ఏళ్ల ధనీష్, 20 ఏళ్ల అభిరామి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇంట్లో వాళ్లకు చెప్పడానికి మొదట చాలా భయపడ్డారు. తర్వాత ధైర్యం చేసి తమ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిపారు. మొదట వాళ్లు ససేమిరా అన్నారు.
కానీ చివరకు వాళ్ల పెళ్లికి ఒప్పుకున్నారు. ఓ రోజు కేరళలోని కుమిలీ పట్టణంలోని ఓ లాడ్జిలో ఈ జంట ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు ఇలా చేశారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ ఘటన అక్కడి ప్రాంతవాసులలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే వారిద్దరు విషం తాగి ఆత్మహత్యకు చేసుకోవడానికి కొన్ని గంటల ముందు ధనీష్ సన్నిహితులకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు సమాచారం అందించాడు.
ఎందుకు అంటూ వాళ్లు కంగారుగా అడిగేలోపే ఫోన్ కట్ చేశారు. వాళ్లు ఎక్కడ ఉన్నారనే సమాచారం కూడా తెలియదు. దీంతో వాళ్లు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వాళ్లు ఈ ఘటనా స్థలానికి చేరేలోపే ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ల తల్లిదండ్రలను , బంధువులను పిలిపించారు పోలీసులు. పెళ్లికి తాము కూడా ఒప్పుకున్నానమని.. ఇలా వాళ్లు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలియదని పోలీసులకు తెలిపారు. అక్కడ ఏమైనా సూసైడ్ నోట్ లభిస్తుందా అని చూశారు.. కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని.. ఈ ప్రేమ జంట మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు. అనంతరం.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎవరైనా వీరిని బెదిరించారా.. అసలు ఇది ఆత్మహత్యా.. హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…