కారులో షికారుకు వెళ్లాలంటే స్నేహితులు, కుటుంబసభ్యలు లేక లవర్స్ తో వెళ్తుంటారు. కానీ ఇక్కడ విచిత్రం. ఏంటంటే.. కారులో ఓ ఆవుతో షికారుకు వెళ్లారు. ఆవును రోడ్డుపై నుంచి తీసుకెళ్లాలంటేనే తెగ ఇబ్బందులు పడుతుంటారు.. కానీ ఓ ఆవును కారులో ఎక్కించడంతో విచిత్రంగానే ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని విస్కాన్సిన్ నివాసి అయిన జెస్సికా నెల్సన్ ఓ హోటల్ ముదు నిలిపిన కారులో ఆవను చూసి ఆశ్యర్యం వేసిందని తెలిపింది.
అస్సలు ఇది నిజామా.. కలా అంటూ కొద్దిసేపు ఆ యువతి అటూ.. ఇటూ చూసింది. వెంటనే ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించింది. తర్వాత ఆమె ఆ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఓ ఆవును కారులో తీసుకెళ్తున్నారంటూ ఆమె దానికి క్యాప్షన్ కూడా ఇచ్చింది.
ఇది చూసిన నెటిజన్లు ఇతర సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తుండగా.. తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో కాస్త ఆవు యజమాని వరకు వెళ్లింది. దీంతో అతడు పోస్ట్ చేసిన యువతిని కాంటాక్ట్ అయ్యాడట. అతడు చెప్పిన విషయాలను ఆమె అసోసియేటెడ్ ప్రెస్‌కి వెల్లడించింది. అతడు చెప్పిన మాటలకు ఆమె ఇంకా ఆశ్చర్యానకి గురైందట.
ఇంతకు అతడు ఏం చెప్పాడంటే.. మీకు అద్దంలో కనిపించింది పెద్ద ఆవు కాదు. అది దూడ మాత్రమే అని అన్నారట. ఆ ఒక్కటే కాదు.. కారు వెనకాలు మరో రెండు దూడలు కూడా ఉన్నాయన్నారు. మొత్తం మూడు దూడలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఆమె అంత ఖరీదైన కారులో దూడలను తీసుకెళ్లడం ఏంటని ఆమె ఇంకా ఆ కన్ ఫ్యూజన్ లోనే ఉందట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…