క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ప్రెస్టేజియస్ మూవీ పుష్ఫ. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు. ఇప్పటికే దేవీశ్రీప్రసాద్ అందిచిన మ్యూజిక్ అభిమానులను అలరిస్తోంది.
దీంతో ఈసినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాపై సంచనల వ్యాఖ్యలు చేసింది హరోయిన్ రష్మికా మందన్న తనకు స్టోరీ తెలియకుండానే యాక్ట్ చేశానని చెప్పింది.
సుకుమార్ సినిమా అంటేనే స్టోరీని సీక్రెట్ గా ఉంచుతారు. స్టోరీ గురించి ఒకరిద్దరికి తప్పితే ఎక్కువ మందితో డిస్కస్ చేయరనే అభిప్రాయం కూడా ఉంది.
షూటింగ్ సమయంలో చిన్నచిన్న మార్పులు చేయడం.. కథను మార్చడం వంటివి చేస్తుంటాడు. సినిమా డిసెంబర్ 17న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తోంది. వీటికి రష్మికా స్పెషల్ అట్రక్షన్ గా నిలుస్తున్నారు. తాజాగా సినిమా గురించి రష్మికా ఆసక్తికర కామెంట్లు చేసింది. పుష్ఫ సినిమా చేస్తున్న సమయంలో కథ గురించి తెలియదని.. డబ్బింగ్ చెబుతున్నప్పుడే కథ గురించి తెలిసిందన్నారు.
ఈ సినిమాను మిస్ చేసుకుంటే.. పెద్ద హిట్ ను కోల్పోయేదాన్ని అని చెప్పుకుంటూ వచ్చింది. ఈ చిత్రంలో రష్మికా డీ గ్లామరస్ రోల్ లో కనిపిస్తోంది. బన్నీ ఊరమాస్ గెటప్ లో లారీ డ్రైవర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. సినిమా ఈనెల 17న విడుదలవుతోంది. విడుదల తరువాత ఎన్ని రికార్డులను పుష్ప మూవీ కొల్లగొడుతుందో చూడాలి.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…