RRR Movie: ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం.. విడుదలయ్యేది ఎప్పుడంటే?
RRR Movie: రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా ఎన్నో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 7వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నారని పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేశారు. కేవలం సినిమా ప్రమోషన్ కోసమే 45 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే ఉందనగా చిత్రబృందం అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా వేసినట్లు నిర్మాత అధికారకంగా తెలియజేస్తూ అభిమానులలో నిరాశ కల్పించారు.ఈ క్రమంలోనే విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేసిన చిత్రబృందం నేడు అధికారికంగా ఈ సినిమా విడుదల తేదీని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ క్రమంలోనే నిర్మాత డివివి దానయ్య ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ సినిమాని మార్చి 18వ తేదీ విడుదల చేస్తామని ప్రకటించారు. ఒకవేళ ఈ తేదీకి కుదరని పక్షంలో ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీకి విడుదల చేస్తామని అప్పటికీ కరోనా పూర్తిస్థాయిలో తగ్గి థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని చిత్ర బృందం భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ 2 తేదీలలో ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాత తెలియచేసారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…