Ramya Raghupathi: మైసూర్ హోటల్లో ప్రత్యక్షమైన నరేష్ పవిత్ర జంట.. చెప్పుతో దాడి చేయబోయిన రమ్య?
Ramya Raghupathi: గత కొన్ని రోజుల నుంచి నరేష్ రమ్య రఘుపతి పవిత్ర లోకేష్ మధ్య ట్రయాంగిల్ వివాదం కొనసాగుతోంది.వీరి పెళ్లి, విడాకులు, సహజీవనం గురించి పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ మైసూర్ లోని ఒక హోటల్లో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయం తెలిసిన రమ్య ఏకంగా వారిపై దాడి చేయడానికి ప్రయత్నం చేసింది.
నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు మైసూర్ లోని ఒక హోటల్లో ఉన్నారనే విషయం తెలుసుకున్న రమ్య ఏకంగా హోటల్ కి వెళ్లి పవిత్ర లోకేష్ పై చెప్పు తీసుకొని దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రమ్యను పోలీసులు అడ్డుకున్నారు.హోటల్లో రమ్మని చూస్తున్న నరేష్ విజిల్ వేస్తూ పవిత్రతో కలిసి లిఫ్ట్ లో పైకి వెళ్లడంతో రమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రమ్య ఏకంగా నటి పవిత్ర పై దాడికి ప్రయత్నించిందని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే పవిత్ర కారణంగానే నరేష్ కు తనకు మధ్య దూరం ఏర్పడిందని మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నప్పటికీ మేము ఇంకా విడాకులు తీసుకోలేదని,నాకు విడాకులు ఇవ్వకుండానే నరేష్ పవిత్రని ఎలా పెళ్లి చేసుకుంటారు అంటూ ఈమె ఆరోపించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా రమ్య పవిత్ర గురించి ఆరోపణలు చేయడంతో పవిత్ర స్పందించారు.
రమ్య ఉద్దేశపూర్వకంగానే తనని బ్యాడ్ చేయడం కోసమే హైదరాబాద్ నుంచి కర్ణాటక వచ్చి ఇక్కడ తనని బ్యాడ్ చేస్తుందని ఆరోపించారు. తనకు భర్త కావాలి అనుకున్నప్పుడు కుటుంబంతో కలిసి కుటుంబ పెద్దలతో తన సమస్య గురించి మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ ఇలా రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదంటూ పవిత్ర రమ్య వ్యాఖ్యలపై స్పందించారు. అయితే తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ మైసూర్లో ఒక హోటల్లో కనిపించడంతో మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…