సినిమా రంగంలో తన అందం, అభినయం, ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి శ్రీలీల ఎప్పుడూ తన ఎనర్జీతో మెరిసిపోతుంటుంది. అయితే, ఆ చిరునవ్వు వెనక ఉన్న క్రమశిక్షణ, కష్టపడే మనసు గురించి తానే చెబుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
శ్రీలీల తన దినచర్య గురించి మాట్లాడుతూ, క్రమశిక్షణే తన విజయానికి మూలమని తెలిపారు:
“నేను స్కూల్ టైమ్ నుంచే బిజీగా ఉండడం అలవాటు చేసుకున్నా. ఒక వైపు చదువులు, ఇంకోవైపు డాన్స్, మ్యూజిక్ వంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ — రెండింటినీ సమతుల్యం చేసుకోవడం నేర్చుకున్నా. సెలవుల్లో కూడా ఏదో కొత్త స్కిల్ నేర్చుకోవడమే నా హాబీ.”
ప్రస్తుతం ‘మాస్ జాతర’ సినిమా ప్రచారంలో పాల్గొంటున్న శ్రీలీల తన ఉత్సాహంతో ఎక్కడ ఉన్నా అక్కడ హంగామానే ఉంటుందని అందరూ చెబుతారని నవ్వుతూ చెప్పారు.
“నాకు ఎప్పుడూ నవ్వడం, ఇతరులను నవ్వించడం చాలా ఇష్టం. నేను ఎక్కడ ఉన్నా అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి — అదే నాకు ఇష్టమైన కాంప్లిమెంట్,” అని ఆమె తన వ్యక్తిత్వాన్ని వివరించారు.
వరుస ఆఫర్స్ వస్తున్నా, పాత్రల ఎంపికలో శ్రీలీలకు స్పష్టమైన ఆలోచన ఉంది:
“నాకు చాలా స్క్రిప్ట్‌లు వస్తుంటాయి. కానీ నేను కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే కాదు, నటనకు స్కోప్ ఉన్న పాత్రలే ఎక్కువగా ఎంచుకుంటా. ఏ పని చేసినా దానికి ఒక పర్పస్ ఉండాలి, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది.”
తనను చేసుకోబోయే వ్యక్తి గురించి కూడా శ్రీలీల చాలా స్పష్టంగా తన మనసులోని మాట చెప్పారు:
ప్రతిరోజూ పాజిటివ్ ఎనర్జీతో, నవ్వుతో, నిబద్ధతతో ముందుకు సాగుతున్న శ్రీలీల కెరీర్‌లోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా నిజాయితీ, సరదా, సమతుల్యం అనే ఫిలాసఫీతో స్పష్టమైన దిశలో ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…