Crime: శ్మశాన వాటికలో తన తల్లి సమాధిని తవ్వి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కొడుకు..ఎందుకో తెలుసా..!
Crime: భూమి మీద బతికే ప్రతీ జీవి మరణించాల్సిందే. పుట్టుక అనేది ఎంత నిజమో మరణం అనేది కూడా అంతే నిజం. కాకపోతే ఒకరు ముందు మరణిస్తారు.. మరికొంతమంది ఆలస్యంగా మరణిస్తారు. అయితే ఓ వ్యక్తి చనిపోయిన తన తల్లిని మర్చిపోలేక.. తీవ్ర మనోవేదనకు గురై శ్మశానంలో పాతి పెట్టిన తన తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు.
దీనికి సంబంధించిన వివరాలు ఇవే. తమిళనాడుకు రాష్ట్రం పెరంబూరు జిల్లా కున్నం సమీపంలోని పరవై గ్రామానికి చెందని 38 ఏళ్ల బాలమురుగన్ కు పెళ్లి కాలేదు. అతడి తండ్రి పది సంవత్సరాల క్రితం మరణించాడు. అప్పటి నుంచి అతడి బాగోగులు అతడి తల్లి ముక్కాయి (65) చూసుకుంటూ ఉండేది. 10 నెలల క్రితం ఆమె తల్లి అనారోగ్యానికి గురై మరణించింది.
ఇక ఆ రోజు నుంచి అతడు ఒంటరి వాడు అయ్యాడు. ఏం చేయాలో తోచక అతడు ప్రతీ రోజు శ్మశానానికి వెళ్లి.. తన తల్లి అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో తనలో తానే మాట్లాడుకునే వాడు. అక్కడే ఎన్నో సార్లు నిద్ర కూడా పోయాడు. ఒకానొక సమయంలో వర్షం పడితే సమాధి తడవకుండా ఉండేలా చూసేవాడు. అయితే ఇటీవల అతడు తన తల్లి సమాధిని తవ్వి.. అందులో పాక్షికంగా కుళ్లిపోయిన తన తల్లి శవాన్ని ఇంటికి తీసుకొచ్చాడు.
ఇలా ఇంట్లోనే ఆ శవాన్ని ఉంచడంతో ఇళ్లంతా దుర్వాసన వచ్చింది. ఓ రోజు అతడి ఇంటికి తన బంధువు వచ్చాడు.. ఏంటి ఈ వాసన అని అడగ్గా.. అతడిని అక్కడ నుంచి పంపించేశాడు. అతడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి తనిఖీ చేయగా.. విషయం అంతా బయటపడింది. అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. అక్కడ పాక్షికంగా కుళ్లిపోయిన మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విచారణ నిమిత్తం బాలమురుగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు సమక్షంలో దహనం చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…