The theater owner's troubles with pawan kalyan fans
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, సినిమాపై రివ్యూస్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. క్రిటిక్స్ అత్యధికంగా 2 నుంచి 2.5 రేటింగ్స్ ఇచ్చారు. దీంతో యావరేజ్ టాక్ వినిపిస్తోంది.
అయితే టాక్ ఎలా ఉన్నా, పవన్ ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షోను ఒక పండగలా చేసుకుంటారు. థియేటర్లలో నానా హంగామా చేస్తారు. బ్యానర్లు, పూల వర్షాలు, బాణాసంచాలతోపాటు.. కొంతమంది స్క్రీన్ మీదకే ఎక్కిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో స్క్రీన్‌ను కూడా పగులకొడతారు. ఇది నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలకు తలనొప్పిగా మారుతోంది.
ఈ తరహా హంగామా కట్టడికి హైదరాబాద్‌లోని ప్రసిద్ధి గాంచిన సంధ్య థియేటర్ యాజమాన్యం వినూత్న చర్యలు తీసుకుంది. స్క్రీన్ ముందు ఇనుప కంచెలతో పాటు ముళ్లతో కూడిన ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాదు, పైన మొలలు ఉండేలా స్టీల్ స్ట్రిప్‌లను అమర్చారు. దీంతో ఎవరైనా దాన్ని దాటి స్క్రీన్ వైపు వెళితే గాయాలే గాక, ప్రాణాలకే ప్రమాదమవుతుందని చెబుతున్నారు.
పైన మాత్రమే కాదు, కింద కూడా భద్రతా చర్యలు తీసుకున్నారు. సీట్ల మధ్య సిమెంట్ ఇటుకలు పెట్టి, కుర్చీలు దెబ్బతినకుండా చూసుకున్నారు. థియేటర్ యాజమాన్యం తీసుకున్న ఈ భద్రతా చర్యలు, ఫ్యాన్స్ వెర్రి చేష్టలకు ఎదురుగా వారు పడుతున్న కష్టాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు “ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండండి”, “ఇది సినిమా.. మీ ప్రాణాలు కాదు” అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు, పవన్ అభిమానుల లోకం మరోసారి వార్తల్లో నిలిచింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…