Suman: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణ లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో సుమన్!
Suman:టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్ర నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హీరో సుమన్ ఒకరు. ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం గురించి స్పందిస్తూ ఆయన తన అభిప్రాయాలను తెలియ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మే 30 న దర్శకుడు దాసరి నారాయణ రావు గారి వర్ధంతి కావడంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే దాసరిని స్మరించుకుంటూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హీరో సుమన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరి ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నప్పుడు అతను ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించే వారని వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా దాసరి బయ్యర్ల గురించి ఎక్కువగా ఆలోచించే వారు.ఒక సినిమాని కొనుగోలు చేసి బయ్యర్లు నష్టపోతే తర్వాత సినిమాని ఫ్రీగా వారికి ఇచ్చేవారని ఇలా బయ్యర్లు నష్టపోకుండా దాసరిగారు వారికి ఎంతో అండగా ఉండే వారని సుమన్ దాసరి సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత నిర్మాతలు బయ్యర్ల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని వెల్లడించారు.
ప్రస్తుత కాలంలో ఒక్కొక్క సినిమా కొన్ని కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇన్ని కోట్లు పెట్టిన సినిమా తప్పకుండా మంచిగా ఆడుతుందని బయ్యర్లు కూడా కోట్లలో సినిమాలను కొనుగోలు చేస్తారు. అయితే కొన్నిసార్లు సినిమా ఫ్లాపయితే తీవ్రంగా నష్టపోతున్నారని, వారి గురించి ఆలోచించే వారు లేరని ఈ సందర్భంగా సుమన్ వెల్లడించారు. నేను ఈ మాటలు అన్ని ఆవేశంతో అన్నది కాదు ఇవన్నీ నిజాలేనని సుమన్ వెల్లడించడంతో ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…