ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే చాలామంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి రాత్రి పడుకునే ముందు పాలతో పాటు అంజీర పండ్లను తినడం చేస్తుంటారు. ఇలా తినడం మంచిదేనా.. పాలతో పాటు అంజీరను కలిపి తినడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే..
అంజీర పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనకు తెలిసిందే. ఇందులో ఫైబర్ లు, విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటి ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.అదేవిధంగా పాలలో కూడా అధిక మొత్తంలో క్యాల్షియం విటమిన్స్ ప్రోటీన్స్ ఉండటం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాకుండా, ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి.మరి ఈ రెండింటినీ రాత్రి పడుకునే ముందు కలిపి తీసుకోవటం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
పాలతో పాటు అంజీర ను కలిపి తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత నుంచి కాపాడుతుంది. ఈ క్రమంలోనే అధిక రక్తపోటు, గుండెపోటు, నిద్రలేమి వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు. జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాలతో పాటు అంజీర కలిపి తినటం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల తొందరగా ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహకరిస్తుంది.
చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్యలలో అతి పెద్ద సమస్య నెలసరి సమస్య. నెలసరి సమయంలో మహిళలు తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. అలాగే కొంతమందిలో అధిక రక్తస్రావం జరుగుతుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు పాలు అంజీర కలిపి తినడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు.
రక్త పోటు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ పాలు అంజీర కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచి రక్తపోటును సాధారణ స్థితిలో ఉంచుతుంది.ఎండిన అంజీర్ పండులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల కండరాల పని తీరును కండరాలను బలంగా ఉంచడానికి దోహదపడుతుంది. కనుక ప్రతిరోజూ రాత్రి పడుకునే సమయంలో పాలలో అంజీరను కలిపి తినటం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలు అన్నింటిని పొందవచ్చు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…