ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య సమంత విడాకులు తీసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడం వల్ల సమంత నాగచైతన్య నుంచి విడాకులు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై పలుమార్లు సమంతను అడగగా సమంత ఈ ప్రశ్నను దాటి వేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విధంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు సమంత ఒక్క ట్వీట్ ద్వారా సమాధానం చెప్పింది నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తన మామయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సమంత చేసిన ట్వీట్ ఇన్ని రోజులు వారి పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్టే అయింది. ఈ ట్వీట్ చూసిన అభిమానులు వీరు విడిపోవడం లేదంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు.. ఆ సాయంత్రానికే అభిమానులకు మరో షాకిచ్చారు సమంత.
సాయంత్రం తన కుటుంబ పెద్ద నాగార్జున పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా తన సన్నిహితులు అందరూ హాజరయ్యారు కానీ సమంత లేకపోవడం మరోసారి అనుమానాలను రేకెత్తిస్తోంది. నాగార్జున పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాలేనంత బిజీగా సమంత ఎక్కడికి వెళ్లారు కేవలం వీరిమధ్య గొడవలు కారణంగానే ఆమె పుట్టినరోజు వేడుకలకు హాజరు కాలేదని మరోసారి వార్తలు ఊపందుకున్నాయి.
ఈ విధంగా సమంత నాగచైతన్య గురించి వస్తున్న వార్తలపై ఓ మీడియా సమంత కు ఫోన్ ఫోన్ చేశారని ఆ సమయంలో సమంత షూటింగ్ సమయంలో బిజీగా ఉన్నారని చెప్పడంతో సదరు మీడియా మరోసారి కాల్ చేయొచ్చా అని అడిగారు. అందుకు సమంత సరేనని చెప్పగా మరోసారి ఫోన్ చేస్తే ఫోన్ రీచ్ కాకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే సదరు మీడియా ఇదే విషయాన్ని సమంతతో వాట్సాప్ చాట్ చేశారు. ప్రస్తుతం ఈ చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే మీడిమా వేరొక నెంబర్ కి ఫోన్ చేస్తే ముందురోజు లిఫ్ట్ చేసిన వారు లిఫ్ట్ చేశారని, కాకపోతే తన సమంత కాదని చెప్పడం పలు అనుమానాలకు కారణం అవుతుంది. అదేవిధంగా సమంతకు ఆ విధంగా మెసేజ్ చేయడం సరైన పద్ధతి కాదంటూ అవతల నుంచి సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే మీడియా ఆగస్టు 26వ తేదీన సమంతకు వాట్సాప్ మెసేజ్ చేయగా ఆ మెసేజ్ ఇప్పటివరకు సమంతకు రీచ్ కాలేదు. అలాగే 27వ తేదీ కూడా మెసేజ్ చేశారు అది కూడా డెలివరీ కాకపోవడం ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా సమంత స్పందించకపోవడంతో వీరి గురించి వస్తున్న వార్తలు నిజమేనెమో అని మరోసారి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం సమంతతో చేసిన వాట్స్అప్ చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరోవైపు సమంత తన బిజీ లైఫ్ నుండి బయటపడి స్నేహితురాలితో ప్రశాంతగా గడుపుతున్నారు. అయితే సమంత, చైతూ ఇద్దరూ దూరంగా ఉంటున్నారా? సమంత ఒంటరిగా వెకేషన్‌కి ఎందుకు వెళ్ళారు? అనేక వార్తలకు సమాధానం చైతన్య, సమంత ఇద్దరూ స్పందిస్తేనే ఆగేలా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…