ప్రముఖ నటుడు రామ్, హీరోయిన్ జెనీలియా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా రెడీ. ఈ చిత్రంలో హీరో రామ్ ఎనర్జీ లెవల్స్ మామూలుగా ఉండవు. నటి జెనీలియాను ప్రేమించిన రామ్, ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆమె కుటుంబసభ్యులతో ఆడిన నాటకాలు, ముఖ్యంగా బ్రహ్మానందంను ఈ చిత్రంలో బాగా వాడుకున్నారనే చెప్పాలి. ఢీ, వెంకీ, దుబాయ్ శీను లాంటి సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్ చేశారో, అలాగే ఈ చిత్రంలోనూ ఓ పవర్‌ఫుల్ రోల్‌ని ఆయన ప్రదర్శించారు.
ఇకపోతే ఈ సినిమా ఆధ్యంతం కామెడీని అందిస్తూ, ప్రేక్షకులను కడుపబ్బా నవ్వించింది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను కూడా రాబట్టింది. సుమారు 17 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీనికి తోడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటల బాణీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. జూన్ 19, 2008న రిలీజైన ఈ మూవీకి రెండు వారాల గ్యాప్‌తో వచ్చిన సినిమా విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రెడీ సినిమాకు 13రోజుల ముందు అలీ హీరోగా నటించిన సోంబేరీ అనే సినిమా విడుదలైంది. కానీ కథాబలం అంతగా ఆకట్టుకోకపోవడం వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని ఎదుర్కొంది. దీని తర్వాత జూన్ 13న రెడీ సినిమాకు 6 రోజుల ముందుగా విశ్వనటుడు కమల్ హాసన్ తీసిన దశావతారం రిలీజైంది. భారీ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం మొదట విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత అందరిచేత మంచి పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత హీరో రాజశేఖర్ నటించిన గోరింటారు. చెల్లెలి సెంటిమెంట్‌కు పెద్దపీట వేస్తూ తీసిన ఈ సినిమాలో అన్నపై అంతులేని అభిమానమున్న చెల్లెలిగా హీరోయిన్ మీరా జాస్మిన్, అలాగే వారిని విడదీయాలని చూసే క్యారెక్టర్‌లో ఆర్తి అగర్వాల్ నటించారు. కుటుంబ కథాచిత్రంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఇలా మొత్తంగా రెడీ సినిమాతో రామ్ నంబర్ 1 పొజిషన్‌లో ఉండగా, ఆ తర్వాత గోరింటాకు’తో రాజశేఖర్, కమల్ హాసన్ దశావతారంతో విజయం సాధించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…