మనం చాలా సంవత్సరాల నుంచి భూగ్రహం అంతం కానుందనే వార్తలు వింటూనే ఉన్నాం. 2012 సంవత్సరానికి ముందు భూగ్రహం అంతం కాబోతున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. చాలామంది అప్పట్లో ఆ వార్తలు నిజమని నమ్మినా అవి నిజం కాలేదు. అయితే తాజాగా మళ్లీ భూమి అంతం కాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి 2068లో భూమి అంతం కానుందని.. ఇందుకు ఒక ముఖ్యమైన కారణమే ఉందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శాస్త్రవేత్తలు ఒక గ్రహశకలం భూమిని ఢీ కొట్టబోతుందని ఆ కారణం వల్లే భూమి అంతం కాబోతుందని తెలుపుతున్నారు. ఖగోళ పరిశోధకులు ఈ వార్తను వట్టి పుకారుగా భావించవద్దని ఆధారాలు ఉండటం వల్లే ఈ విషయం చెబుతున్నామని వెల్లడిస్తున్నారు. అపోఫిస్ -99942 అనే గ్రహ శకలం భూమికి అతి దగ్గరగా వస్తోందని.. ఈ గ్రహశకలం భూమిని ఢీ కొట్టనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమికి 400 మీటర్ల దూరం వరకు ఈ గ్రహశకలం వచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 16 సంవత్సరాల క్రితమే శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలాన్ని గుర్తించారు. 2029 సంవత్సరంలో ఈ గ్రహశకలం భూమి నుంచి స్పష్టంగా కనిపిస్తుందని తెలుపుతున్నారు. 1 : 150 నిష్పత్తిలో ఈ గ్రహశకలం భూమి ఢీ కొట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఈసారి వస్తున్న వార్తలు శాస్త్రీయ ఆధారాలతో చెబుతున్నవని.. అందువల్ల గత అంచనాలతో పోల్చి చూస్తే ఇది చాలా ఖచ్చితమైన తేదీ అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అయితే 2068 సంవత్సరాం రావడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో చాలామంది ఈ వార్తలను పట్టించుకోవడం లేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…