Featured

ఈ బిచ్చగాడు సినిమా డిస్ట్రిబ్యూటర్ లను లక్షాధికారులను చేసింది.!!

భిన్నమైన కథ, విభిన్నమైన కథనం, మైమరిపించే మాటలు, మత్తెక్కించే పాటలు ఉంటే అది స్ట్రెయిట్ సినిమా అయినా డబ్బింగ్ సినిమా అయినా ప్రేక్షకులు చూస్తారు. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, సూర్య, విశాల్ లాంటి హీరోలు నటించిన ప్రేమ సాగరం, ముత్తు, భాష, భారతీయుడు, అపరిచితుడు, విశ్వాసం, అదిరింది, రఘువరన్ బీటెక్ లాంటి డబ్బింగ్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులు ఆదరించి వాటి ఘన విజయానికి తోడ్పడ్డారు. 2008 సంవత్సరంలో దర్శకుడు శశి “పూ”అనే తమిళ సినిమా తీస్తుండగా ఒకరోజు తన ఇంట్లో మ్యాగజైన్స్, పేపర్స్ తీస్తుండగా అందులో నుంచి ఒక పేపర్ నేల మీద పడింది. అవి ఏమిటని శశి చూడగా అందులో ఒక శ్రీమంతుడు, బిచ్చగాడు గా మారడం.. ఆ కంటెంట్ లో ఉంది.

అలా ఆ కంటెంటు చదివిన దర్శకుడు శశి ఆ రోజు రాత్రి ఆయనకు నిద్ర పట్టలేదు. అదే కంటెంట్ తో కూడిన ఓ కథ రాయడానికి ఆయన దాదాపు 18 నెలల సమయాన్ని తీసుకున్నాడు. ఆ కథని పెద్ద నిర్మాతలకు చెప్పినప్పుడు కోటీశ్వరుడు భిక్షగాడు గా మారడం ఏమిటి.. అని ఎగతాళి చేశారు. ఆ తర్వాత… స్టార్ హీరో అవసరం లేదు, మాస్ ఇమేజ్ ఉన్న హీరో వద్దు, పాటలు ఫైట్లు చేసే సూపర్ హీరో కానవసరం లేదు, అప్పుడప్పుడే ఎదిగే హీరో అయితే చాలు అనుకొని ఆయన ఆలోచిస్తుండగా… మ్యూజిక్ డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ ఇలా మూడు విభాగాల్లో పరిచయమున్న విజయ్ ఆంటోని గుర్తుకొచ్చాడు. ఒకవేళ తన కథ చెబితే, ఆయన ఓకే అంటే.. మూడు విభాగాలు ఒకేసారి కుదిరి పోతాయని దర్శకుడు శశి అనుకున్నారు. వెంటనే శశి విజయ్ ఆంటోని కి ఫోన్ చేసి కథ చెప్పగానే వెంటనే తన ఆఫీస్ కి రమ్మని విజయ్ ఆంటోని చెప్పారు. అక్కడ పూర్తిగా కథ విన్నా విజయ్ ఆంటోని ఈ సినిమా చేద్దామని దర్శకుడు శశి తో చెప్పారు.

అలా తమిళంలో పిచ్చైకారన్(బిచ్చగాడు) సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. దీనిని తెలుగులోకి డబ్ చేస్తే ఎలా ఉంటుందని హీరో విజయ్ అనుకున్నారు. అలా తెలుగులో చదలవాడ లక్ష్మణ్ ఈ సినిమాను 50 లక్షల రూపాయలకు అనువాద హక్కులను తీసుకున్నారు. దాదాపు 75 లక్షలతో సినిమా అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. అలా 2016 మార్చిలో సినిమా విడుదలైంది.

ఆ సమయానికి తెలుగులో సరైనోడు, బ్రహ్మోత్సవం, అఆ సినిమాలు ధియేటర్ లో నడుస్తుండటంతో బిచ్చగాడు సినిమా కేవలం యాభై థియేటర్లలో మాత్రమే సినిమాను విడుదల చేయడం జరిగింది. అలా 50 నుంచి రెండు వందల దియేటర్ లకి బిచ్చగాడు సినిమా ని పెంచడం జరిగింది. 2 కోట్లతో తీసిన ఈ సినిమా దాదాపు 20 కోట్ల వరకు వసూల్లు రాబట్టింది. తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఒక స్టార్ హీరో కు ఇచ్చిన రెమ్యూనరేషన్ లో పది శాతం కూడా ఈ సినిమాకి ఖర్చు చేయలేదు. అయినా ఈ బిచ్చ గాడు సినిమా మంచి లాభాలను తెచ్చి పెట్టింది. అలా ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ లక్షాధికారులు కావడం జరిగింది.

telugudesk

Recent Posts

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు కోర్టు నోటీసులు..!

తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…

6 hours ago

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…

8 hours ago

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…

8 hours ago

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…

8 hours ago

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

9 hours ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

9 hours ago