Bigg Boss OTT Telugu: బుల్లితెర ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పుడు ఓటీటీలో ప్రసారం అవుతూ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి సిద్ధమవుతోంది. మొదటిసారిగా ఈ కార్యక్రమం తెలుగులో ఓటీటీలో ప్రసారం కావడంతో చాలామంది ఈ కార్యక్రమంపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రసారం కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఇక ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో ఇదివరకే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో పాల్గొన్నవారు పాల్గొంటున్నారని అలాగే మరికొందరు పేర్లు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే తాజాగా బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే నంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి అందులో ఎవరున్నారనే విషయానికి వస్తే…
ఇదివరకే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లు…కమెడియన్ ధనరాజ్, ముమైత్ ఖాన్, ఆదర్శ్ తనీష్ ,తేజస్వి ,అషు రెడ్డి ,అరియానా గ్లోరి ,మహేష్ విట్టా, సరయు, హమీదా, నటరాజ్ మాస్టర్.ఇక ఈ కార్యక్రమంలో కొత్తగా పాల్గొనే కంటెస్టెంట్ ల విషయానికి వస్తే…యూట్యూబర్ నిఖిల్, యాంకర్ స్రవంతి చొక్కారపు, RJ చైతు, యాంకర్ శివ, బమ్ చిక్ బబ్లూ
కప్పు ముఖ్యం బిగులూ ఫేమ్ వెంకట్ వంటి 17 మంది కంటెస్టెంట్ లో పాల్గొన్నబోతున్నట్లు సమాచారం. అయితే ఈ కంటెస్టెంట్ గురించి అధికారికంగా తెలియాల్సి ఉంది.
భారతదేశంలో ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన నగరాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేది కాశీ. వేల ఏళ్ల చరిత్ర, అనేక పురాణ…
ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగింది. జిమ్‌లకు వెళ్లేవారు మాత్రమే కాదు, బరువు తగ్గాలని భావించే వారు కూడా…
ఉదయం టీతో రెండు బిస్కెట్లు, సాయంత్రం కాఫీకి మరికొన్ని – ఇది చాలామందికి రోజువారీ అలవాటు. పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో…
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన…
హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు లక్షలాది మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు – అందరికీ…
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఘన విజయాలకు ప్రతీకగా నిలిచిన బ్యానర్లలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ…