బిగ్ బాస్ 5వ సీజన్ కూడా నిన్నటితో ముగిసింది. భారీ అంచనాల మధ్య ప్రారంభమైన 5వ సీజన్ అంచనాలను అందుకోలేకపోయిందని తెలుస్తోంది. గత సీజన్లలో లాగా ఈ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ముఖ్యంగా ప్రేక్షకులకు తెలియని కంటెస్టెంట్లు ఎక్కువగా ఉండటం ఈ సీజన్ కు మేయిన్ డ్రాబ్యాక్ గా చెబుతున్నారు. దీంతో పాటు బిగ్ బాస్ టాస్కులు కూడా ఆసక్తికరంగా లేకపోవడంతో ఈ షోపై అందరూ పెదవి విరిచారు. దీంతో బిగ్ బాస్ రేటింగ్ కూడా పడిపోయాయి.
అయితే ఈ షో గ్రాండ్ ఫినాలేను గ్రాండ్ గా ప్లాన్ చేశారు నిర్వాహకులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథిగా తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. ఒకవేళ పవర్ స్టార్ కనుక వస్తే షో తీరే మారిపోయేది. అయితే భీమ్లా నాయక్ సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో పవన్ రావడం కుదరదని చెప్పేశాడట. ముఖ్యంగా బిగ్ బాస్ 4తో పోలిస్తే బిగ్ బాస్ 5 సీజన్ అంతగా ఆదరణ లేకపోవడంతోనే పవన్ కళ్యాణ్ రాలేదని సమాచారం.
గ్రాండ్ ఫినాలేలో శ్యాంసింగరాయ్ టీం మాత్రమే హల్చల్ చేసింది. నాని, కృతిశెట్టి, సాయిపల్లవి మాత్రం శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోకు హాజరయ్యారు. మరోవైపు ట్రిపుల్ ఆర్ టీం కూడా గ్రాండ్ ఫినాలేకు వస్తుందని అనుకున్నప్పటికీ..కేవలం రాజమౌళి మాత్రమే హాజరయ్యారు. శ్రియ, సుకుమార్, రష్మిక కూడా తమ సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోకు హాజరయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…