Dil Raju: ఏపీ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. ఇక ఏపీ అధికారం కూటమి చేతులలోకి వెళ్ళింది దీంతో చిత్ర పరిశ్రమ చాలా సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి సినిమా టికెట్లు రేట్లు కూడా తగ్గిస్తూ రావడంతో సినీ ఇండస్ట్రీలోని నిర్మాతలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారారు.
సినిమా టికెట్ల రేట్లు సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి చేశారు. ఈ విషయంపై చిత్ర పరిశ్రమ మొత్తం జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచింది. ఇలా వ్యతిరేకత రావడమే కాకుండా జగన్ కూడా ఓటమిని చవిచూడటంతో చిత్ర పరిశ్రమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కూటమి అధికారంలోకి రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పూర్వ వైభవం రాబోతుందంటూ నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు సైతం ఈ విషయం గురించి మాట్లాడుతూ నాకు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ లాంటివారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిర్మాతలకు లాభాలు..
సినీ ఇండస్ట్రీ నుంచి ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందిన వీరిద్దరూ అఖండమైన మెజారిటీ సొంతం చేసుకున్నారు. దీంతో దిల్ రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇక ఈ విషయం పై నేటిజన్స్ స్పందిస్తూ నిర్మాతల లాభాలు కోసం ఇప్పటినుంచి భజనలు చేయడం మొదలుపెట్టారని, పేదలకు మేలు చేసేలా జగన్ తీసుకున్న నిర్ణయాలు వీరికి ఇబ్బందికరంగా మారాయి అంటూ నెటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…