Prabhas Marriage: బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇలా ప్రతిరోజు ప్రభాస్ పెళ్లి గురించి ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ ఈయన మాత్రం తన పెళ్లి వార్తలపై ఎప్పుడు స్పందించలేదు. ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే, ప్రభాస్ జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్.
ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించారు.బాహుబలి సినిమా తర్వాత మీకు వేలసంఖ్యలో ప్రపోజల్స్ వచ్చాయట కదా అని రిపోర్టర్స్ అడగగా… ఆ ప్రశ్నకు ప్రశ్న సమాధానం చెబుతూ 5 వేల వరకు ప్రపోజల్స్ వచ్చాయని తెలిపారు.
ఇలాంటి పరిస్థితులు కనుక మీకు వస్తే మీరు ఏం చేస్తారు అంటూ సరదాగా అందరీ సలహా అడిగారు.ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ తన పెళ్లి గురించి మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈయన తన జీవితంలో ప్రేమ పెళ్లి చేసుకుంటానని మొదటిసారిగా తన పెళ్లి గురించి స్పందించారు.
ఇలా పెళ్లి గురించి మాట్లాడిన ప్రభాస్ తన పెళ్లి ఎవరితో చేసుకుంటారు ఎప్పుడు చేసుకుంటారు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఏది ఏమైనా తమ అభిమాన నటుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నటువంటి ప్రభాస్ నోటవెంట పెళ్లి మాట రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…
ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…