Categories: FeaturedMovie News

మహేష్ కోసం రెడీగా ఉన్న ముగ్గురు డైరెక్టర్లు… మరి వంశీ పైడిపల్లి సినిమా ఇక లేనట్టేనా..??

“సరిలేరు నీకెవ్వరూ” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఒక గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే కథ అని, ఇందులో ఎన్ని మార్పులు చేసినా మహేష్ కి నచ్చకపోవడంతో నిర్మొహమాటంగా పక్కన పెట్టారనే వార్తలు వినిపించాయి. అయితే మహేష్ కి మొదటి నుంచి వంశి చెప్పిన స్టోరీ నచ్చలేదని, మహర్షి వంటి హిట్ సినిమా ఇచ్చిన వంశి మీద అభిమానంతో మరో ఛాన్స్ ఇచ్చాడని టాక్. కానీ కథ నచ్చకపోవడంతో వంశీ సినిమాను పక్కన పెట్టేసి పరశురామ్ సినిమాని లైన్ లో పెట్టారట సూపర్ స్టార్. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ పరశురామ్ సినిమాపై పెట్టిన మహేష్. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

పరశురామ్ సినిమా తరువాత మహేష్ బాబు, వంశి పైడిపల్లి సినిమా వస్తుందని అనుకున్నారు. కానీ తాజాగా దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ తో చేస్తున్నా అని ప్రకటించిన విషయం తెలిసిందే.. దూరంగా ఆర్ట్స్ బ్యానర్ మీద కే. ఎల్ నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయింది. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

అయితే పరశురామ్ సినిమా అయిపోయిన తరువాత రాజమౌళి సినిమాకి మధ్య లో మహేష్ తో సినిమా చేయడానికి మరో ఇద్దరు డైరెక్టలు రెడీ గా ఉన్నట్టు తెలుస్తుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లతో సినిమా చేసే ప్లాన్ లో మహేష్ బాబు ఉన్నారని టాలీవుడ్ వర్గాల టాలీవుడ్ వర్గాల సమాచారం. మరి పరశురామ్ సినిమా తరువాత రాజమోళి సినిమా ఉంటుందా లేక త్రివిక్రమ్, అనిల్ లలో ఒకరితో సినిమా చేస్తారా అనేది తెలియాల్సిఉంది. ఇదంతా చూస్తుంటే వంశి పైడిపల్లితో మహేష్ బాబు సినిమా ఇక ఉండదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు కోర్టు నోటీసులు..!

తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…

8 minutes ago

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…

2 hours ago

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…

2 hours ago

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…

2 hours ago

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

2 hours ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

2 hours ago