Featured

Thripuraneni Chitti Babu : చిరంజీవి అలా మాట్లాడడం తప్పే… నందమూరి ఫ్యాన్స్, మెగాఫ్యాన్స్ మధ్య వార్ గురించి చిట్టిబాబు కామెంట్స్..!

Thripuraneni Chitti Babu : ఇండస్ట్రీ లో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్ నిర్మాతల సమస్యల కోసం షూటింగుల బంద్. సినిమా టికెట్ రేట్స్ తగ్గితే, ఓటీటీ లో సినిమాలు త్వరగా రావడం వల్ల థియేటర్ కి జనాలు రావడం లేదంటూ అందరూ అనుకుంటున్నారు. సినిమాల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలంటూ నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. అయితే కొంతమంది గిల్డ్ నిర్మాతలు మాత్రం హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి అంటూ మాట్లాడుతున్నారు. ఇక ఈ ఇష్యూ తో పాటు మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వార్ గురించి కామెంట్స్ చేసారు.

మెగాస్టార్ అలా మాట్లాడటం తప్పు…

ఇటీవల ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన చిరు కొంతమంది డైరెక్టర్స్ గురించి పరోక్షంగా కామెంట్స్ చేసారు. స్క్రిప్ట్ ముందే రెడీ చేసుకోరని సెట్స్ కి వచ్చాక స్క్రిప్ట్ ఇస్తే ఎలా ప్రిపేర్ అవుతారు ఆర్టిస్టులు అంటూ మాట్లాడారు. ఇక ఈ విషయాన్నీ కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా ప్రమోషన్స్ సమయంలో ప్రస్తావించగా మా సినిమా విషయంలో అలా జరగలేదు వాళ్ళ సినిమాకి అలా జరిగిందేమో అంటూ కళ్యాణ్ రామ్ అనడంతో ఆ విషయాన్ని సోషల్ మీడియాలో మెగాస్టార్ ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ ను ట్రోల్ చేయడం, ఇక కళ్యాణ్ రామ్ ను నందమూరి ఫ్యాన్స్ మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అనడంతో మరింత వార్ ముదిరింది.

ఇక దీనిపై చిట్టిబాబు స్పందిస్తూ మెగాస్టార్ వివరాలు చెప్పకుండా పలానా డైరెక్టర్ అని చెప్పకుండా ఊరికే అలా కామెంట్స్ చేయడం తప్పు. ఆయన మాట్లాడిన విషయం మాత్రం కరెక్టే అంటూ మాట్లాడారు. ఆ డైరెక్టర్ ఎవరో చెప్పుంటే ఇంత చర్చ జరిగివుండేది కాదు అంటూ చెప్పారు. ఇక పని లేనివాళ్లు పేరు ఊరు చెప్పకుండా ఇలాంటి ట్రోల్ల్స్ చేస్తుంటారు అలాంటివి ఇండస్ట్రీ లో ఎవరు పట్టించుకోరు అంటూ చిట్టిబాబు కామెంట్స్ చేసారు. టికెట్ రేట్లు తగ్గితే జనాలు సినిమాలు చూడటానికి థియేటర్ వస్తారు అంటూ అభిప్రాయ పడ్డారు.

Bhargavi

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

4 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

4 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

4 hours ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

4 hours ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

4 hours ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

5 hours ago