ప్రతిభన్నది ఏ ఒక్కరి సొంతం కాదు.. ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభని బయటకు తీసినప్పుడే వాలంటే ఏమిటో ప్రపంచానికి తెలుస్తోంది. ఆవిధంగా టిక్ టాక్ పుణ్యమా అని వెలుగులోకి వచ్చారు నరసాపురానికి చెందిన దుర్గారావు జంట. వీళ్ళిద్దరూ రికార్డింగ్ డాన్స్ లాగ హావా భావాలు చూపిస్తూ.. దుర్గారావు భార్య మ్యూజికల్ నైట్ సింగర్ లా తల ఊపుతా పాటలు పాడటం, వాటికి దుర్గారావు డాన్స్ చెయ్యటం వీరి ప్రత్యేకత. వీరిద్దరి డాన్స్ స్టైల్ నచ్చి మంచి ఫాల్లోయింగ్ పొందారు ఈ జంట.
ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్ హీరో సంపూ స్థాయిలాంటి క్రేజ్ అన్నమాట. ఈమధ్య టిక్ టాక్ ను బ్యాన్ చేసినప్పటికీ.. వీళ్ళిద్దరూ మాత్రం తమ వీడియోలను ఆపలేదు. తాజాగా యూట్యూబ్, ఫేస్ బుక్ లను ఉపయోగించుకొని వీడియోలు చేస్తున్నారు. తమ ఫ్యాన్స్ కు వినోదాన్ని పంచుతున్నారు. “నాది నక్కిలీసు గొలుసు” అనే పాటకు దుర్గారావు వేసిన స్టెప్స్ చాలా ఫేమస్ అయ్యాయి. ఈటీవీ ఢీ షోలో కూడా దుర్గారావు పేరుతో డ్యాన్స్ కూడా వేశారు. వీళ్లు ఇంత ఫేమస్ అయ్యాక ఎవరు ఊరుకుంటారు చెప్పండి.? అందుకే సరాసరి వీళ్లిద్దరినీ జబర్దస్త్, అదిరింది షోలలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరిగాయి. “అదిరింది” షో లో కూడా దుర్గారావు మెరుపులా మెరిశారు. అలాగే “జబర్దస్త్” లో హైపర్ ఆది స్కిట్ లో దుర్గారావు దంపతులు సందడి చేశారు.
అయితే.. “జబర్దస్త్” స్కిట్ లో హైపర్ ఆది వాళ్లకు ఎంతో కొంత స్కోప్ ఇచ్చి ఉంటారులే అని అందరూ అనుకున్నారు. కానీ.. ఆ స్కిట్ లో దుర్గారావు దంపతులను కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఉంచి ఆ తర్వాత ఆ షో నుంచి పంపించేశారు. వాళ్ల ఫేమస్ స్టెప్పు “నాది నక్కిలీసు గొలుసు” పాటకు మాత్రం డ్యాన్స్ వేయించి.. 2 పంచులు వేసి దుర్గారావుకు కనీసం ఒక్క డైలాగ్ కూడా ఇవ్వకుండా.. ఆది వాళ్లను వెంటనే స్టేజీ మీది నుంచి పంపించేయడం దుర్గారావు ఫ్యాన్స్ ను బాగా హర్ట్ చేసిందట. కేవలం తన స్కిట్ కు హైప్ పెంచుకోవడం కోసం హైపర్ ఆది ఇలాంటి ఛీప్ ట్రిక్స్ ప్లే చేశాడంటూ దుర్గారావు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే దుర్గారావు కనిపించింది కొన్ని సెకన్లే అయినా.. ఆయన కనిపించినంత సేపు ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యారని.. సెట్ లో ఉన్నవాళ్లు కూడా కడుపుబ్బా నవ్వుకున్నారని దుర్గారావు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దుర్గారావును టీమ్ లీడర్ గా తీసుకొని సపరేట్ టీమ్ సెటప్ చేసి జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే చాన్స్ ఆయనకు ఇవ్వాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం…
పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే సందేహాలు…
ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి…
భారతదేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Indian…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం వేగవంతమైన మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది. డైట్, వ్యాయామం కంటే త్వరగా ఫలితం రావాలనే…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, అసమయ భోజనం, తక్కువ నీటి వినియోగం వంటి కారణాల వల్ల మలబద్ధకం సమస్య చాలా మందిలో…