Categories: FeaturedMovie News

గేమ్ షోస్ లో ప్రైజ్ మనీ నిజంగా ఇస్తారా? అస్సలు డ్రామా తెలియాలంటే ఇది చదవాల్సిందే… !

“క్యాష్” దొరికినంత దోచుకో, “వావ్” మంచి కిక్కిచ్చే గేమ్ షో, పండుగ చేస్కో, స్టార్ మహిళ, మోడ్రన్ మహాలక్ష్మి అనే ముచ్చటైన పేర్లతో బుల్లితెరపై ప్రసారమయ్యే పలు గేమ్ షోలు ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గేమ్ షోలలో పాల్గొనే కంటెస్టెంట్లు లక్షల కొద్దీ సొమ్మును సంపాదించుకున్నట్టు చూపిస్తుంటారు. అయితే నిజంగా కంటెస్టెంట్లు డబ్బు సంపాదిస్తారా అనే అనుమానం బుల్లితెర ప్రేక్షకులలో కలగకమానదు. అసలు అందులో నిజమెంతో అబద్ధమెంతో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

బుల్లితెర గేమ్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు కార్యక్రమం తనకి పోయేంత వరకూ డబ్బులు ఇచ్చినట్టు, తీసుకున్నట్టు కానీ నటిస్తారు. యాంకర్ సుమ క్యాష్ షో లో లక్షల రూపాయలు ఇచ్చినట్లు చూపిస్తున్నారు కానీ అదంతా ఉత్తదే. సెలబ్రెటీలు పాల్గొనే అన్ని గేమ్ షోలలో డబ్బులు రూపాయి కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. ప్రోగ్రాం లో ఇచ్చినట్టు చూపిస్తారు కానీ అది నిజమని నమ్మితే పప్పులో కాలేసినట్టే లెక్క. సాయి కుమార్ హోస్ట్ గా బాధ్యతలను నిర్వర్తించే వావ్ గేమ్ షోలో కంటెస్టెంట్లగా పాల్గొన్న సెలబ్రిటీలకు లక్షల రూపాయలు ఇచ్చినట్టు చూపిస్తుంటారు. షోలో ఆడుతున్నప్పుడు కంటెస్టెంట్లు డబ్బులు కోల్పోతే నిజంగానే ఆస్తంతా పోయినట్టు గగ్గోలు పెడుతుంటారు కానీ అదంతా నటనే. గేమ్ షోలో అడిగే క్వశ్చన్ లకు మాత్రం సమాధానాలు ముందుగా చెప్పరు. ఒక్క డబ్బు విషయం తప్ప గేమ్ షోలో జరిగేవన్నీ దాదాపు నిజమే.

అయితే గేమ్ షోలో కుర్చీలో కూర్చుని చప్పట్లు కొడుతూ కనిపించే ప్రేక్షకులు జూనియర్ ఆర్టిస్టులు కాగా… వారికి మాత్రం రూ. 500 నుండి 1000 వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ ట్రెండ్ అంతరించిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం టీవీ నిర్వాహకులు షో మేనేజర్లను ఏదో ఒక కాలేజీకి పంపించి విద్యార్థులను షోలో ప్రేక్షకులుగా కూర్చోబెట్టమని అడుగుతున్నారు. టీవీలో కనిపించవచ్చని చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ గేమ్ షోలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఫలితంగా జూనియర్ ఆర్టిస్టులను పిలిపించి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోతుంది. అలాగే గేమ్ షోలను కాలేజీ స్టూడెంట్స్ తో పాటు వారి బంధు మిత్రులందరూ కూడా తప్పకుండా వీక్షిస్తుంటారు. దాంతో గేమ్ కి ఉచిత ప్రచారం కూడా లభిస్తుంది.

ఇకపోతే స్టార్ మహిళ, పండగ చేస్కో వంటి ప్రోగ్రాములలో సామాన్యులు పాల్గొంటుంటారు. వాళ్లకి ఈ గేమ్ షో లో ఇచ్చే బహుమతులు, డబ్బులు కూడా నిజంగానే ఇస్తారు. డాన్స్, పాటల రియాల్టీ షోలలో కూడా పార్టిసిపెంట్లకు డబ్బులు ఇస్తారు కానీ టాక్స్ పేరిట 40 శాతం వరకు తీసుకొని మిగతా డబ్బులు ఇస్తారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago