హిందూ సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య (Amavasya) చాలా శక్తివంతమైనది. కనుక ఈ అమావాస్య రోజున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ముఖ్యంగా శనివారం ఏర్పడే అమావాస్య రోజున శని దేవుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారని పండితులు తెలుపుతున్నారు. శని ప్రభావం ఎక్కువగా ఎవరినైతే పట్టిపీడిస్తోందో వారు అనేక ఇబ్బందులకు గురవుతారు. అయితే వారు ఈ శనివారం శని అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక పూజలు చేసి శని దేవుని ఆరాధిస్తే వారికి సుఖ శాంతులు కలుగుతాయి. ఇందుకోసం చేపట్టాల్సిన కొన్ని పద్ధతుల గురించి ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా తెలుసుకుందాం.. అయితే ఇదే రోజున సూర్య గ్రహణం కూడా ఏర్పడుతోందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ సూర్య గ్రహణ ప్రభావం భారత దేశంలో తక్కువగా ఉంటుంది. ఇతర దేశాలలో సూర్యగ్రహణం పూర్తిస్థాయిలో ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో ఏర్పడే చివరి సూర్యగ్రహణం ఇది. ఈ గ్రహణం రోజు ముఖ్యంగా గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. అయితే శని అమావాస్య రోజు శని దేవుణ్ణి (Shani devudu) ఇలా ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పంచాంగం ప్రకారం 2021 సంవత్సరంలో డిసెంబర్ నాలుగో తేదీన శనివారం రోజున శని అమావాస్య (Shani amavasya) ఏర్పడింది. ఈ శని అమావాస్య మార్గశిర మాసంలో ప్రారంభమవుతుంది. ఈ శనివారం శని అమావాస్య రోజు శని దేవునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శని దేవుని పూజించి ఆయనను ప్రసన్నం చేసుకుంటే మనపై ఉన్న శని దోషాలు (Shani doshalu) పూర్తిస్థాయిలో తొలగిపోతాయి. మనకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. శని అనుగ్రహం పొందుతాము. ఈ రోజున ముఖ్యంగా రావిచెట్టును పూజించడంతో మంచి ఫలితం (Good result) దక్కుతుంది. రావి చెట్టు (Peepal tree) దగ్గర ఆవ నూనెతో దీపారాధన చేయడంతో శని దోషాలు తొలగిపోతాయని పండితులు తెలుపుతున్నారు. రావి చెట్టును పూజించి చెట్టు చుట్టూ ఏడు సార్లు ప్రదర్శన చేయాలి.
అలాగే శని దేవునికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా మంచి ఫలితం ఉంటుంది. శని దేవునికి నల్ల నువ్వులు (Black sesame) అంటే చాలా ఇష్టం. ఇలా నల్లనువ్వులతో శని దేవుని ఆరాధన చేస్తే శని దేవుని అనుగ్రహం (Grace) మన మీద ఉంటుంది. ఏలినాటి శని తొలగి ఆయురారోగ్యాలతో ఉంటాము. విష్ణు దేవుని స్వేదం నుంచి ఏర్పడినవే నల్లనువ్వులు. నల్ల నువ్వులను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ శనివారం శని అమావాస్య రోజున శని దేవాలయంలో నువ్వులను దానంగా ఇవ్వాలి. అలాగే శని దేవాలయంలో నువ్వుల నూనెతో (Sesame oil) దీపారాధన చేయాలి. ఇలా చేయడంతో మంచి ఫలితం దక్కుతుంది. శని అమావాస్య రోజున ఏదైనా ఇనుముకు సంబంధించిన వస్తువులను దానం చేస్తే శుభం (Good luck) కలుగుతుంది. ఈ రోజున చేపలకు పిండిపదార్థాలను ఆహారంగా పెడితే మంచి ఫలితం లభిస్తుంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…