Featured

బ్రేకింగ్ న్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య నేటి ఉదయం అనారోగ్య సమస్యతో కన్నుమూశారు.ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు లోనైన రోశయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు.

హైదరాబాదులోని స్టార్ హాస్పిటల్ కు తరలిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయన పార్థివదేహం ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం. ఈయన తన రాజకీయ జీవితంలోఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టారు.

మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో ఎంతో సాన్నిహిత్యం ఉన్న రోశయ్య అతని మరణానంతరం ఆపధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఏడాదిన్నర పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన రోశయ్య అనంతరం ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16వ ముఖ్యమంత్రిగా రోశయ్య ప్రమాణస్వీకారం చేశారు.రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుకుగా పాల్గొనే రోశయ్య ఆర్థిక మంత్రిగా బాధ్యతలు వ్యవహరిస్తూ సుమారు 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.రాజకీయాలలో ఎంతో అనుభవం ఉన్న రోశయ్య ఇలా మరణించడంతో పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మరికాసేపట్లో ఆయన పార్థివదేహం ఆస్పత్రి నుంచి తన స్వగృహానికి తరలించనున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago