Tolly wood Actress: సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లో హీరో హీరోయిన్లు ఒక అద్దాల మేడ వంటి వారు. వారిపై ఎప్పుడు ఏ విధంగా రాళ్లు పడతాయో ఎవరికీ తెలియదు. ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీలకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో షికారులు చేయడమే కాకుండా వారిని దారుణంగా కించపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు ఈ విధమైనటువంటి చేదు అనుభవాలు అధికంగా ఉంటాయి.
ఈ క్రమంలోనే ఒకప్పుడు పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయిన నటి కస్తూరి శంకర్ గురించి అందరికీ సుపరిచితమే. ఈమె నాగార్జున నటించిన అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణ చెల్లెలు పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.అయితే ప్రస్తుతం ఈమె పలు వెబ్ సిరీస్ లలోను అలాగే బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు.
ఒక బడా వ్యాపారవేత్తతో ఎఫైర్ పెట్టుకుందనే వార్తలు గతంలో పెద్ద ఎత్తున వచ్చాయి.అయితే ఈ వార్తల గురించి ఓ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి శంకర్ ను యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కస్తూరి శంకర్ సమాధానం ఇస్తూ…తనకి ఓ 70 సంవత్సరాలు వయసున్న ఒక వ్యాపారవేత్తతో అఫైర్ ఉందనే వార్తలు రావడం చాలా బాధాకరం అంటూ సమాధానం చెప్పారు.
అయితే గతంలో ఒక విషయం గురించి నేను ఆ వ్యాపారవేత్తను కలిసిన విషయం నిజమే అయితే ఓ ముఖ్యమైన విషయం గురించి తనను మేము కలవగానే ఇలాంటి వార్తలు రావడం దురదృష్టకరం.ఈ క్రమంలోనే మీడియా వాళ్ళు నా గురించి ఇలాంటి వార్తలు సృష్టించారని, అయితే నేనంటే గిట్టని వాళ్లు మాత్రమే ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేశారు అంటూ కస్తూరి శంకర్ ఈ సందర్భంగా సమాధానం చెప్పారు. అయితే ఆ ప్రముఖ వ్యాపార వేత్త ఎవరు ఏంటి అనే విషయం మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…