గత కొద్దీ రోజులుగా మన దేశంలోని సినీ పరిశ్రమల్లో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా టాలీవుడ్ దర్శకుడు, జక్కన్న రాజమౌళికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇప్పటికే బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెల్సిందే…ఇక ఈ మహమ్మారి నుంచి బిగ్ బి ఫ్యామిలీ మెంబర్స్ కోలుకున్నారు కానీ అయన మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళికి తాజాగా జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు అయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసారు.
”నేను, నా కుటుంబసభ్యులు గత కొద్దిరోజుల క్రితం జ్వరంతో బాధపడ్డాం. అది తగ్గిపోయింది కానీ కరోనా టెస్ట్ చేయించుకున్నాం. అయితే స్వల్ప లక్షణాలతో కూడిన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మేము అందరం హోం క్వారంటైన్‌లో ఉన్నాం. అందరు బాగానే ఉన్నాం… అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. శరీరంలో యాంటీబాడీస్ ఏర్పడాలని చూస్తున్నాం. ఆ తర్వాత ప్లాస్మా దానం చేస్తాం” అని రాజమౌళి ట్వీట్ ద్వారా తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…