Movie News

Mukul Dev : టాలీవుడ్ లో విషాదం.. ‘కృష్ణ’ సినిమా విలన్ ముకుల్ దేవ్ మృతి!

Mukul Dev : టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ ఇక లేరు. ఆయన వయసు 54 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త ఆయన అభిమానులను, సినీ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

ముకుల్ దేవ్ మరణ వార్తను ఆయన స్నేహితురాలు, నటి దీప్శిఖా నాగ్‌పాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “నమ్మలేకపోతున్నాను. రిప్” అంటూ ఆయనతో ఉన్న ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ పోస్ట్ తెలియజేస్తుంది.

సన్ ఆఫ్ సర్దార్ చిత్రంలో ముకుల్‌తో కలిసి నటించిన నటుడు విందు దారా సింగ్ కూడా ఈ విషాద వార్తను ధృవీకరించారు. ముకుల్‌ను మళ్లీ తెరపై చూసే అవకాశం ఎప్పటికీ రాదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ముకుల్ దేవ్ చివరిగా ఆంత్ ది ఎండ్ అనే హిందీ చిత్రంలో నటించారు.

నటుడు రాహుల్ దేవ్ సోదరుడు అయిన ముకుల్ దేవ్ హిందీ, పంజాబీలతో పాటు పలు దక్షిణాది చిత్రాల్లో కూడా నటించారు. రవితేజ హీరోగా నటించిన ‘కృష్ణ’ చిత్రంతో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘కేడి’, ‘అదుర్స్’, ‘సిద్ధం’, ‘మనీ మనీ మోర్ మనీ’, ‘నిప్పు’, ‘భాయ్’ వంటి చిత్రాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించారు. 2022లో విడుదలైన ‘అంత్ ది ఎండ్’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు.

తల్లిదండ్రులు మరణించడంతో ముకుల్ దేవ్ ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ముకుల్ దేవ్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు.

telugudesk

Recent Posts

కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలా? ఇంట్లోనే సింపుల్ సొల్యూషన్!

కళ్ల చుట్టూ నల్లటి వలయాలు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యగా మారాయి. తక్కువ నిద్ర, ఒత్తిడి, స్క్రీన్…

28 minutes ago

చాపింగ్ బోర్డు మీద లక్షల క్రిములా? ఇలా క్లీన్ చేయకపోతే ప్రమాదం!

వంటగదిలో శుభ్రత ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. మనం ఉపయోగించే పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుంటాం. అయితే రోజూ…

36 minutes ago

నీళ్లు మాత్రమే కాదు… బార్లీ నీరు తాగితే డబుల్ బెనిఫిట్!

వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లగా ఉంచడం, నీటి లోపాన్ని నివారించడం అత్యంత అవసరంగా మారుతోంది. ఈ సమయంలో…

3 hours ago

వేడి నుంచి రక్షణ… కర్బూజా ఎందుకు ‘సమ్మర్ సూపర్ ఫుడ్’?

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న కొద్దీ శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో దాహాన్ని తీరుస్తూ, శరీరానికి చల్లదనం…

4 hours ago

ఒక్క అడుగు కాదు… ప్రతి అడుగు నమస్కారం! అమర్నాథ్ యాత్రలో అరుదైన ఘటన!

దేశవ్యాప్తంగా శివభక్తి గురించి చర్చ జరుగుతున్న వేళ, ఇద్దరు భక్తుల అసాధారణ సంకల్పం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంచు కొండల…

4 hours ago

తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్… సామాన్య భక్తులకు గుడ్ న్యూస్!

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…

4 hours ago