Krishnaveni: రంగుల ప్రపంచంలో ఎన్నో కష్టాలు.. చివరికి పని మనిషిగా కూడా మారాను.. నటి కన్నీటి కష్టాలు!
Krishnaveni: సినిమా ప్రపంచం అంటేనే ఎన్నో ఒడిదొడుకలతో కూడుకొని ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో విజయవంతంగా తమ కెరీర్ ను గడిపిన వాళ్లు ఉన్నారు.. మరికొంత మంది డబ్బులు లేక సినిమా ఆఫర్లు లేక పస్తులు ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. భయట అనుకునేంత అందంగా సినీ యాక్టర్ల జీవితాలు ఉండవని… కేవలం తెరపై మాత్రమే రంగులు పూసుకొని కనపడినా తమ జీవితాలు.. తెర వెనుకు ఎన్నో ఆటుపోటులు ఉన్నాయని చెప్పుకొచ్చింది సీనియర్ నటి కృష్ణవేణి.
90ల్లో ఎన్నో సినిమాల్లో కామెడీ ఆర్టిస్టుగా పని చేసిన ఈమె తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా రానించారు. తర్వాత కొన్నాళ్లు ఆఫర్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డట్లు తెలిపారు.
తినడానికి కనీసం తిండి లేక అలమటించానని.. అమెరికాలో ఓ 90 సంవత్సరాల పెద్ద మనిషి ఇంట్లో పని మనిషిగా చేరినట్లు తెలిపారు. ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ లో అనుభవించిన కష్టాల గురించి చెబుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆఫర్లు వచ్చిన సమయంలోనే సంపాదించుకోవాలని.. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిదయదని అన్నారు. అయితే ప్రస్తుతం తాను ఆనందంగానే ఉన్నానని.. కష్టాల నుంచి వచ్చిన ఎఫెక్ట్ ఇప్పుడు అనుభవిస్తున్నాని చెప్పింది. మరో విషయం ఏంటంటే.. ఆమె బంధువులు కూడా చాలా మంది సినీ పరిశ్రమలోనే ఉన్నారని తెలిపారు. అమృతం సీరియల్‌లో గుండు హనుమంతురావు భార్యగా నటించిన రాగిణి స్వయానా తనకు చెల్లి అవుతుందని చెప్పారు. అంతే కాదు మరో నటి రజిత కూడా ఇండస్ట్రీలో ఉన్నట్లు తెలిపారు. ఈమె స్వయానా అక్క కూతురు అవుతుందని చెప్పారు. కొన్ని వందల సినిమాల్లో నటించిన తర్వాత కూడా.. పూట గడవడం కష్టంగా మారి పని మనిషిగా మారడం అనేది దారుణం అని.. ఆమె గురించి తెలుసుకున్న సగటు సినీ ప్రేక్షకుడు ఆవేదన చెందుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…