‘బాహుబలి’ చిత్రంతో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారి పోయాడు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుండటంతో ప్రభాస్ పారితోషికం కూడా అదే స్థాయిలో పెరిగింది. తాజాగా ప్రభాస్ భారత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోగా ఎదిగాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. డార్లింగ్ ప్రభాస్ రెమ్యునరేషన్ పై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.
సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంత పెద్ద రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే ఏకైక స్టార్ హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడనేది టాలీవుడ్ సమాచారం. ఇదిలా వుండగా.. టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రానికి రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ‘రాధేశ్యామ్’ చిత్రం సొంత బ్యానర్ లో నిర్మాణం జరుగుతుంది కాబట్టి అది ప్రభాస్ ఇష్టం. కానీ., వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్న ప్రభాస్ 21వ చిత్రానికి మాత్రం దిమ్మ తిరిగే రెమ్యునరేషన్ ను డిమాండ్ చేశాడని తెలిసింది. ఈ చిత్రం అశ్వనీ దత్ అల్లుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తుందన్న తెలిసిందే. లేటెస్ట్ గా అందిన టాలీవుడ్ సమాచారం ప్రకారం.. ప్రభాస్ కి 70 కోట్ల రెమ్యునరేషన్ తోపాటు ఇతర భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసినందుకు గానూ డబ్బింగ్ రైట్స్ లో 50% వాటా తనకే ఇవ్వాలనే షరతు పెట్టాడట. ఆ షరతు ప్రకారమే అశ్వనీ దత్ యూనిట్ అంగీకరించారని, ఈ చిత్ర కథానాయిక దీపిక పదుకొనేకు 18 కోట్ల నుంచి 20కోట్ల వరకూ రెమ్యునరేషన్ ను ఇవ్వబోతున్నారనే గాసిప్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ లెక్కన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకునెతో పోలిస్తే టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ 5 రెట్లు అధికంగానే రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడన్న మాట. మొత్తానికి ఎలా చూసినా ప్రభాస్ తన సినిమా కెరీర్ లోని 21వ చిత్రానికి 100 కోట్లు అందుకుంటున్నమాట అక్షరాల నిజమని టాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ రెమ్యునరేషన్ టాపిక్ ప్రభాస్ ఫ్యాన్స్ ను షేక్ చేస్తోంది. కేవలం ఈ చిత్రంలో నటించే హీరో, హీరోయిన్ లకే 100 కోట్లకు పైగా అశ్వనీ దత్ రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే.. ఇక ఈ చిత్ర నిర్మాణానికి ఇంకెంత బడ్జెట్ పెట్టబోతున్నారో..? ఊహిస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది కదా.! ఒకవైపు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంటే.. కొందరు సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనా బారిన పడి విలవిలలాడుతున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అటు వెండితెర, ఇటు బుల్లితెర పరిశ్రమలన్నీ అల్లాడిపోతుంటే.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఈ రూమర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి.!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…