NTR: స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం తన అద్భుతమైనటువంటి బాడీ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు కానీ ఒకానొక సమయంలో ఎన్టీఆర్ విపరీతమైనటువంటి శరీర బరువు ఉండడంతో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా రాఖీ సినిమా సమయంలో ఎన్టీఆర్ అధిక శరీర బరువు కారణంగా ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఈయన యమదొంగ సినిమాలో ఉన్న ఫలంగా శరీర బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ లావుగా ఉండడంతో ఓ కమెడియన్ ఎన్టీఆర్ పట్ల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ అలీ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తూ ఉంటాయి. అయితే ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ ఆలీతో మాట్లాడుతూ అన్న ఇప్పుడు ఎలా ఉన్నాను అంటూ తన శరీర బరువు తగ్గిన తర్వాత అడిగారట అప్పుడు ఆలీ మాట్లాడుతూ ఇంతకుముందు హరికృష్ణ తండ్రిలాగా ఉండేవాడివి ఇప్పుడు ఎన్టీఆర్ కొడుకులాగా ఉన్నావు అంటూ కామెంట్ చేశారట.
ఎన్టీఆర్ తో పోల్చారు..
అదేంటన్న అంత మాట అనేసావు ఇంతకుముందు నేను అంత చెండాలంగా ఉండే వాడినా అంటూ ఎన్టీఆర్ తిరిగి ప్రశ్నించారట అయినా పోనీలే హరికృష్ణ గారి తండ్రి లాగా అన్నావు హరికృష్ణ గారి తండ్రి అంటే ఎన్టీఆర్ గారే కదా నన్ను ఎన్టీఆర్ తో పోల్చినందుకు చాలా హ్యాపీ అన్న అంటూ రిప్లై ఇచ్చారని ఒక సందర్భంలో ఎన్టీఆర్ స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. అయితే ప్రస్తుతం మాత్రం ఎన్టీఆర్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పాలి.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…