Priyanka -Siva Kumar: ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కిన బిగ్ బాస్ ప్రియాంక శివకుమార్.. ఫోటోలు వైరల్!

Priyanka -Siva Kumar: బుల్లితెర సీరియల్ నటీనటులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో శివకుమార్ ప్రియాంక జోడి ఒకటి అని చెప్పాలి. వీరిద్దరూ మౌనరాగం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సీరియల్ లో హీరో హీరోయిన్లుగా నటించిన వీరిద్దరూ నిజజీవితంలో కూడా ప్రేమలో పడ్డారు.

ఇలా బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించడమే కాకుండా బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా ప్రియాంక పాల్గొని సందడి చేశారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని బయటకు వచ్చినటువంటి ఈమెకు తరచూ తన ప్రియుడితో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

ఇలా తాము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నటువంటి తరుణంలో ఏదో ఒక ఇబ్బందులు తలెత్తుతున్నాయని తమ పెళ్లి చేసుకోవడం ఒక కోరికగానే మిగిలిపోయిందని పలు సందర్భాలలో వెల్లడించారు.అయితే తాజాగా ఈ జంట పెళ్లి పీటలు ఎక్కి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

మా ఇంటి పండుగ..
ఇక ఈ జంట పెళ్లి చేసుకుంది ఎక్కడో కాదు ఒక బుల్లితెర షోలో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఉగాది పండుగ సందర్భంగా మా ఇంటి పండుగ అనే పేరుతో స్టార్ మా ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 10 జంటలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సెలబ్రిటీ కపుల్స్ కి తీరని కోరికలను తీర్చడమే కాన్సెప్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే తమ పెళ్లికి తీరని కోరికల మిగిలిపోతుందని ప్రియాంక శివకుమార్ కమెడియన్లు ఇతర బుల్లితెర సెలబ్రిటీల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.