Jagapathi Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా జగపతిబాబు ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా ఈయన తన కెరీర్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాకు చిన్న సినిమాలు చేయాలనే కోరిక ఉంది కమిటెడ్ గా సినిమాలు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంటున్నాయి. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను డబ్బున్న పేద వాడిని.
పెద్ద సినిమాలకు కమిట్ అయ్యాను కానీ ఆ సినిమా షూటింగ్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి దీనివల్ల ఇతర సినిమాలను కూడా ఒప్పుకోలేకపోతున్నానని తెలిపారు. మరోవైపు అమ్మో జగపతిబాబునా ఆయన పెద్ద సినిమాలకు మాత్రమే కమిట్ అవుతారు. పైగా రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా తీసుకుంటానని అనుకుంటున్నారు తద్వారా నాకు చిన్న సినిమాలలో అవకాశాలు రావడం లేదు.
చిన్న సినిమాలలో అవకాశాలు లేవు…
ఇలా పెద్ద సినిమాల కారణంగా నాకు చిన్న సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో నా కెరియర్ అటూ ఇటూ కాకుండా పోయింది. ఒకానొక సమయంలో నా కెరియర్ ముగిసిపోయిందని కూడా అనుకున్నాను. అయినా మీ జగపతిబాబు ఎక్కడికి వెళ్లరు. వెళ్లినట్టే వెళ్లి తిరిగి వచ్చేస్తారు అంటూ ఈయన చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…