Categories: FeaturedMovie News

అందాల తార లైలా ఇప్పుడెలా వుందో తెలుసా.?

టాలీవుడ్ హీరోయిన్ లైలా పేరు చెప్పగానే ఆమె నవ్వే గుర్తుకువస్తుంది. ప్రతిక్షణం, ప్రతి మాటకు ముందు వెనుక నవ్వుతూ సరదాగా కనిపించే చలాకీ కళ్ళ చిన్నదైన లైలా గోవాకు చెందిన క్యాథలిక్ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఈమె ఇంట్లో అందరూ ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఈమె 1980 అక్టోబర్ 24న జన్మించింది. ఆ రోజుల్లో ముంబయిలో నివసించే లైలా మోడలింగ్ వృత్తిని హాబీగా చేపట్టింది. ఆ తర్వాత ఈమె ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మెహమూద్ కంటిలో పడి దుష్మన్ దునియాకా చిత్రంలో తొలి అవకాశం చేజిక్కించుకుంది. తరువాత తెలుగు సినిమా దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి ఈమెను ఎగిరే పావురమా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశాడు.

ఆ తర్వాత ఈమె చాలా సినిమాలలో నటించింది. ఈమెకు 2001, 2003 సంవత్సరాల్లో వరుసగా ఉత్తమ తమిళనటిగా ఫిలిం పేర్ అవార్డులు లభించాయి. ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో క‌థానాయిక‌ గా ఓ వెలుగు వెలిగిన లైలా ఉగాది, శుభ‌లేఖ‌లు, ఎగిరే పావుర‌మా, పెళ్లి చేసుకుందాం వంటి సినిమాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, త‌మిళ చిత్రాల్లోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో “పవిత్ర ప్రేమ” చిత్రంలో నటించడం వల్ల ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమె 2006లో ప్రముఖ ఇరానీ వ్యాపారవేత్త మెహదిన్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. పెళ్ళయ్యాక చిత్ర పరిశ్రమకు దూరమైన లైలా ఇద్దరు పిల్లల తల్లిగా ఇంటికే పరిమితమైంది. ఇప్పుడా పిల్లలు కూడా పెద్దవాళ్ళయ్యారు. తాజాగా తెలుగులో రీ ఎంట్రీకి రెడీ అవుతుందని, ఇప్ప‌టికే చాలా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని, అయితే క‌థలోని పాత్ర‌ల్ని దృష్టిలో పెట్టుకుని మంచి సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకొన్న‌ట్టు సోషల్ మీడియాలో గాసిప్స్ వినబడుతున్నాయి.

దేవ‌యాని, మీనా, ఇంద్ర‌జ, భూమిక వంటి ఒక‌ప్ప‌టి క‌థానాయిక‌లు రీ ఎంట్రీ ఇచ్చి మంచి పాత్ర‌ల్లో మెరుస్తున్నారు. వాళ్ల వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లు కూడా ల‌భిస్తున్నాయి. అలాగే లైలా కూడా తెలుగులో న‌టించేందుకు ఉత్సాహం చూపిస్తోందని ఈ గాసిప్స్ సారాంశం. కానీ వాస్తవానికి లైలాకు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, తమిళ రంగంలో కూడా మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. కానీ తమ వైవాహిక జీవితం సంతోషకరంగా సాగిపోతుండటంతో భర్త వ్యాపార లావాదేవీలలో పాలుపంచుకుంటున్న లైలా తనకు వచ్చిన సినిమా ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తుందట. అదండి అసలు విషయం. అంటే ఈ లెక్కన మన అందాల తార లైలా మళ్ళీ వెండితెరపై కనబడుతుఞదనే ఆశను ఆమె ఫ్యాన్స్ వదులుకోవల్సిందేనన్నమాట..!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago