తేజస్వి మదివాడ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి తెలుగు చిత్రాలలో మెయిన్ హీరోయిన్ పక్కన చిన్న చిన్న పాత్రల్లో మెరిసి, ఆ తర్వాత “ఐస్ క్రీమ్” చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైనా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయిన “ఐస్ క్రీమ్” పాప తేజస్వీ ఒక్కసారిగా బిగ్ బాస్ సీజన్ 2లో కనిపించేసరికి బాగానే పాపులరై పోయింది. ఇప్పటికీ తేజస్వి మదివాడ అంటే ప్రేక్షకులెవరూ గుర్తు పట్టరేమో కానీ బిగ్‌బాస్ షోలో కౌశల్ తో గొడ వ పెట్టుకున్న తేజస్వి అంటే భలే గుర్తు పట్టేస్తారు.
బిగ్ బాస్ షో హౌస్ లోపల పొట్టి పొట్టి దుస్తులు వేసుకుని సందడి చేసిన తేజస్వి అప్పటికే పెళ్లైన సామ్రాట్ తో అనుబంధం కొనసాగించడంతో తేజస్వి, సామ్రాట్ ల టాపిక్ పై సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించాయి.. కానీ ఆ రూమర్స్ అన్నిటికీ చెక్ పెడుతూ ‘బిగ్‌బాస్” షో నుంచి బయటికి వచ్చిన తర్వాత తేజస్వి సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది. ఇదిలా వుండగా.. ఈమధ్య కాలంలో సినిమా అవకాశాలు ఎక్కువగా రాకపోవడంతో తేజస్వీ వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది. ఈ ప్రయత్నంలో భాగంగానే లేటెస్ట్ గా “క మి ట్మెంట్” అనే వెబ్ సిరీస్ ను ఒప్పుకుంది. ఆ వెబ్ సిరీస్ కొత్త పోస్టర్‌ను కూడా ఈమధ్యనే విడుదల చేశారు.
ఇక ప్రస్తుత విషయానికొస్తే.. తాజాగా తేజస్వీ తన పెళ్ళి వార్తను పరోక్షంగా ఫ్యాన్స్ కు తెలియజేసే ప్రయత్నంలో ‘మై హస్బండ్’ అంటూ ఒక వ్యక్తి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు తేజస్వీకి అసలు పెళ్లెప్పుడైంది? సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా.? ఇంతకీ తేజస్వీని వరించిన వరుడెవరు.? వంటి సమాధానం లేని సందేహాలతో జుట్టు పీక్కుంటున్నారు. మరి అభిమానుల సందేహాలకు తేజస్వీ నుండి ఎలాంటి సమాధానాలు వస్తాయో వేచి చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…