Movie News

Rekha Vedavyas : అప్పుడు నరకం అనుభవించాను.. ఇప్పటివరకు పెళ్లి కాలేదు.. టాలీవుడ్ హీరోయిన్ రేఖ వేదవ్యాస్

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రేఖ వేదవ్యాస్. టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా, తనదైన ముద్ర వేసుకున్న ఈ భామ, 2001లో ‘ఆనందం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి, ఆ తర్వాత ‘ఒకటో నెంబర్ కుర్రాడు’, ‘దొంగోడు’, ‘జానకి వెడ్స్ శ్రీరామ్’, ‘ప్రేమించుకున్నాం’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఒకప్పుడు యూత్‌కి కలల రాణిగా మారిన రేఖ, తన అందం, అభినయంతో అందర్నీ మెస్మరైజ్ చేసింది.

Tollywood heroine Rekha Vedavyas about her health and marriage

సినీ పరిశ్రమకు దూరం, అనారోగ్యంతో పోరాటం

అయితే తెలుగులో అవకాశాలు తక్కువ రావడంతో ఆమె ఎక్కువగా కన్నడ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. కెరీర్ మంచి ఊపుమీద ఉన్న సమయంలోనే అనూహ్యంగా సినిమా ప్రపంచానికి గుడ్ బై చెప్పింది. 2014 తర్వాత ఆమె వెండితెరపై కనిపించకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.

అనంతరం ఓ రియాలిటీ షోలో పాల్గొన్న రేఖ, బక్కచిక్కిన శరీరంతో, గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రూపంతో అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నట్టు చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితం, అనుభవాల గురించి ఓపెన్‌గా మాట్లాడింది.

బెంగళూరు నుంచి ముంబైకి, రీ-ఎంట్రీకి సన్నాహాలు

బెంగళూరులో పుట్టిన, పెరిగిన రేఖ, కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌ ప్రారంభించిందట. ఆ తర్వాత తెలుగు, కన్నడ సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ముంబైలో నివసిస్తూ, మళ్లీ నటన రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించింది.

ఆమె మాట్లాడుతూ, “వ్యక్తిగత కారణాల వల్ల 2014 నుంచి 2020 వరకూ సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నాను. కోవిడ్ రాకముందే మళ్లీ నటించాలనే ఆలోచన వచ్చింది. టెలివిజన్ షోలో కూడా పాల్గొన్నాను. కానీ అప్పుడే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత అనారోగ్యంతో తీవ్రంగా బాధపడ్డాను. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా పూర్తిగా కుంగిపోయాను. నిజంగా నరకాన్ని అనుభవించాను. మళ్లీ కోలుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఆ ఆరోగ్య సమస్య వల్ల ఎంతో బాధపడ్డాను. అంతటి ప్రభావం చూపించగలదని అప్పుడు తెలిసింది” అని వెల్లడించింది.

పెళ్లిపై రేఖ అభిప్రాయం

“ఇప్పటివరకు నేను పెళ్లి చేసుకోలేదు. ఈ మధ్య విడాకులు పెరిగిపోతున్నాయి. అందుకే సరైన వ్యక్తి దొరికిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను” అని తెలిపింది.

మళ్లీ వెండితెరపై మెరిపించేందుకు సిద్ధమవుతున్న ఈ నటికి అభిమానులు ఇప్పటికే ఎగిరి గంతేస్తున్నారు. రేఖ వేదవ్యాస్ రీ ఎంట్రీతో మరోసారి టాలీవుడ్‌కి ఓ టాలెంటెడ్ బ్యూటీ తిరిగి వస్తుందన్న ఆశ జనం మనసుల్లో చిగురిస్తోంది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago