Categories: FeaturedMovie News

ఈ టాలీవుడ్ హీరోయిన్స్ ఇప్పుడు చుస్తే మీ కళ్ళను మీరే నమ్మరు…!!

హీరోయిన్స్… ఈ పేరు వినగానే ముందుగా మనకి సన్నని శరీరాకృతి గల అందమైన యువతులు మన కళ్ల ముందు మెదులుతారు. 21వ శతాబ్దంలో హీరోలు లావుగా ఉన్నా సరే హీరోయిన్లు మాత్రం సన్నగా ఉండకపోతే ఏ దర్శకనిర్మాతలు సినిమాల్లో అవకాశాలు ఇవ్వరు. అందుకే హీరోయిన్లు తమ కెరీర్ కొనసాగినన్నిరోజులు కడుపు మార్చుకుని మరీ చాలా సన్నగా నాజూకుగా తమ శరీరాన్ని మెయింటైన్ చేస్తుంటారు. అయితే తమ నాజూకైన సొగసుతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కొంతమంది హీరోయిన్లు కొద్ది రోజుల్లోనే ఎవరు గుర్తు పట్టనంత లావుగా తయారై తమ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశారు.

చాలామంది హీరోయిన్లు తమకు సినిమాల్లో అవకాశాలు సన్నగిల్లి పోగానే పెళ్లి చేసుకొని విపరీతంగా లావై పోతుంటారు. ఇప్పటికే మనం చాలా మందిని చూసే ఉంటాం కానీ అతి తక్కువ వయస్సులోనే చాలా లావుగా తయారై గుర్తుపట్టలేనంతగా స్థాయిలో మారిపోయిన హీరోయిన్లు మాత్రం చూసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఐతే ఈ ఆర్టికల్ లో చిన్న వయసులోనే లావుగా తయారైన కథానాయకిలు ఎవరో తెలుసుకుందాం తెలుసుకుందాం.

  1. నిషా కొటారి

రెండేళ్ల క్రితం సినిమా పరిశ్రమలో అత్యంత సెక్సీ హీరోయిన్ కుర్రకారుకి మతులు పోగొట్టేసిన నిషా కొటారి ఒక్కసారిగా లావెక్కిన తన శరీరంతో దర్శనమిచ్చి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. మధ్యాహ్నం హత్య అనే ఈ సినిమాతో వన్ తెలుగు పరిశ్రమలో అరంగేట్రం చేసిన నిషా కొటారి అనంతరం బాలకృష్ణ సరసన ఒక్కమగాడు సినిమాలో అందాలను విపరీతంగా ఆరబోసి సెగలు పుట్టించింది. కానీ అదృష్టం బాగోలేక ఆమె హీరోయిన్గా చాలాకాలం కొనసాగలేకపోయింది. ఎంతో సినిమాలకు దూరం అయిన ఈ భామ కొన్ని రోజుల్లోనే చాలా లావెక్కి ఎవరో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

  1. శరణ్య మోహన్

2009వ సంవత్సరంలో విడుదలైన విలేజ్ లో వినాయకుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన శరణ్య మోహన్ తదనంతరం భీమిలి కబడ్డీ జట్టు వైశాలి వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. మొదటి సినిమాలో బొద్దుగా ఉండే కృష్ణుడు పక్కన హీరోయిన్గా నటించిన శరణ్య మోహన్ అతనిని నుండి ఇన్స్పైర్ అయి ఉందేమో కానీ ఇప్పుడు మాత్రం చాలా బొద్దుగా తయారై తన అభిమానులను తీవ్ర నిరాశలో ముంచెత్తుతుంది.

  1. రక్షిత

ఇడియట్ సినిమా చూసిన వారందరికీ రక్షిత అంటే ఎవరో తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో రవితేజ(చంటి) ముద్దుగా పిలిచే సుచి(సుచిత్ర) పాత్రలో రక్షిత నటించి అందరినీ తెగ అలరించింది. ఏ సినిమా తర్వాత ఆమెకు అనేక హీరోయిన్ అవకాశాలు వచ్చాయి కానీ చాలా రోజుల వరకూ తన హీరోయిన్ అవకాశాలు సంవత్సరాలు గడుస్తున్నా కొద్ది సన్నగిళ్లాయి. చిట్టచివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవకాశాలు కూడా రాకపోయేసరికి ఆమె పెళ్లి చేసుకొని రాజకీయ రంగ ప్రవేశం చేసింది. అయితే ఇటీవల ఆమెకు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట ప్రత్యక్షం కాగా ఆమెను ఎవరు గుర్తు పట్టలేకపోయారు. ఎందుకంటే ఆమె గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా లావుగా తయారైంది.

  1. మోహిని

నందమూరి బాలకృష్ణ సరసన ఆదిత్య 369 సినిమా లో నటించిన మోహిని ఇప్పుడు ఎవరు గుర్తు పట్టలేనంత లావుగా తయారై పోయారు. డిటెక్టివ్ నారద సినిమాల్లో కూడా ఈమె నటించారు హిట్లర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు. అయితే పెళ్లి చేసుకొని తెరపైన మోహని ఆధ్యాత్మికత జీవితం తో బిజీగా ఉన్నారు. ఏదేమైనా బొద్దుగా తయారై మునుపటి కల తన మొహం కోల్పోయారు మోహిని.

ఇంకా ఇలా చెప్పుకుంటూపోతే నమృత, దివ్యవాణి, రాశి రవళి చివరికి అనుష్క శెట్టి కూడా బాగా లావుగా తయారయ్యారు. ఏదేమైనా చాలా రోజుల పాటు కడుపు మార్చుకున్న హీరోయిన్ల మెటబాలిజమ్/ జీర్ణక్రియ వ్యవస్థ బలహీనపడిపోతుంది. దీంతో వారు కొంచెం తిన్నా అది అరగక లావెక్కి పోతుంటారు. అందులోనూ ఆడవాళ్ల శరీరంలోని కొవ్వు చాలా నెమ్మదిగా కరుగుతుంది. అందుకే హీరోయిన్లు కాస్త ఎక్కువ తిన్నా వెంటనే లావైపోతారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago