కరోనా లాక్ డౌన్ టైంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రమ్యకృష్ణ పేరు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. 50 ప్లస్ వయసులో కూడా యంగ్ హీరోయిన్ లకు పోటీ ఇచ్చేంత అందంతో తన హాట్ హాట్ ఫోజులతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేస్తున్న రమ్యకృష్ణ పేరు ఈమధ్య వార్తల్లో సంచలనం సృష్టించింది.
సినీనటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం సీసాలు లభించడంతో అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా మన టాలీవుడ్ నీలాంబరి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను చూసి ఆమె ఫ్యాన్స్ అందరూ షాకయ్యారు. లాక్ డౌన్ లో తాను బాగా ఎంజాయ్ చేస్తున్నానని, ఒక రకంగా చెప్పాలంటే ఈ లాక్ డౌన్ అనేది తన జీవితంలో ముఖ్యమైన దశ అని.. ఇంత తీరిక సమయం తనకు గతంలో ఎప్పుడూ దొరకలేదని, ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉందని ఆనందంగా చెప్పింది. ఈ సందర్భంగా రమ్యకృష్ణ తాజాగా ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోని చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాకయ్యారు.
ఆ ఫోటోలో రమ్యకృష్ణ అందాన్ని చూసిన నెటిజన్లు ఈ వయసులో కూడా ఆమె అందానికి దాసోహమంటున్నారు. ‘అమ్మ పాత్రల్లో నటించకండి. మీకు హీరోయిన్ పాత్రలే కరెక్ట్’ అని కొంటెగా కామెంట్స్ పంపిస్తున్నారు. ఇదిలా వుంటే.. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ ను బాగానే ప్లాన్ చేసుకుందని సమాచారం. ‘బాహుబలి’ చిత్రంలో శివగామిగా నటించిన రమ్యకృష్ణ ఈమధ్య సినిమా ఆఫర్లను ఒప్పుకోవడంలో స్పీడ్ పెంచేసింది. ప్రస్తుతం రమ్యకృష్ణ.. కృష్ణ వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’, పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ‘ఫైటర్’ చిత్రంలోనూ, అలాగే సాయి ధరమ్ తేజ్ చిత్రంలోనూ నటిస్తూ బిజీబిజీగా వుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…