తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో, స్టార్ హీరోల నుంచి నేటి యువ హీరోల సినిమాల వరకు నటించి మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటి అన్నపూర్ణమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొద్ది రోజుల క్రితం అన్నపూర్ణమ్మ మీడియా ముందుకు వచ్చి తనకు దేవదాసు కనకాల గారు భూమి విషయంలో చాలా మోసం చేశారని ఆరోపణలు చేశారు. దేవదాసు కనకాలగారు హైదరాబాదులో ఒక ల్యాండ్ తనకు అమ్మి ,ఆ తరువాత మరోసారి ఆ భూమిని వేరే వాళ్లకు అమ్ముకున్నాడని ఆమె ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే దేవదాసు కనకాల గారు ఆ భూమిని అమ్మిన విషయం తనకుటుంబ సభ్యులు అందరికీ తెలుసని, ఆయన మరణం తర్వాత తన భూమి తనకు ఇవ్వాల్సిందిగా తన కొడుకు రాజీవ్ కనకాలని కోరడంతో అసలు తనకి ఏ విషయం తెలియదు అన్నట్టుగా ప్రవర్తించారని తెలిపారు.
రాజీవ్ కనకాల అతని భార్య సుమ ఈ ల్యాండ్ విషయంలో తనకు సపోర్ట్ చేస్తారని, తన భూమిని తనకి వెనక్కి ఇస్తారని ఆమె భావించినట్లు తెలిపారు. అయితే ఈ భూమి విషయం వారికి అసలు తెలియదన్నట్టు,నేను ఈ విషయం గురించి పదే పదే ఫోన్ చేసినప్పటికీ రాజీవ్ కనకాల ఫోన్ లిఫ్ట్ చేయడమే మానేశారని ఈ సందర్భంగా తెలిపారు.
దేవదాస్ కనకాల గారు నాకు ఈ భూమిని అమ్మినట్లు తన కుటుంబంలోని సభ్యులు అందరికీ తెలుసని, అతను బ్రతికి ఉండగానే ఇదే విషయం గురించి పెద్ద గొడవ కూడా జరిగిందని ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ వెల్లడించారు.అయితే ఈ విషయంలో సుమ తనకు తప్పకుండా న్యాయం చేస్తారని భావించినప్పటికీ వారి నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈమె మీడియా ముందు వారు చేసినటువంటి అన్యాయాన్ని బయట పెట్టింది. మరి అన్నపూర్ణమ్మ చేసిన ఈ వ్యాఖ్యల పై సుమ కనకాల ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…