Movie News

సొంత మరదళ్ళను పెళ్ళాడిన మన టాప్ స్టార్స్ వీళ్ళే..!

ఈ రోజుల్లో పెళ్ళికి ప్రేమకు పెద్ద విలువ మరియు సమయం ఉండటం లేదు. ఓ రోజు చూశామా మాటలు మనసు కలిసాయా ఇక అంతే నెల తిరక్కుండానే పెళ్లి అలాగే ఆరు నెలలు తిరక్కుండానే విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కుతున్నారు. అంతగా పెళ్లికి నానాటికి విలువ తగ్గిస్తున్నారు ఇది సాధారణ జనాల్లోనే కాదు సెలెబ్రెటిస్ కి కూడా వర్తిస్తుంది. కానీ ఇంతకు ముందు రోజుల్లో అలా కాదు, పెద్ద వాళ్ళు ఎవరిని చెప్తే వల్లనే చేసుకునేవారు.. వారితోనే జీవితాలు పంచుకునే వారు. కలకాలం హాయిగా జీవించేవారు. అందుకే అప్పట్లో ప్రేమ పెళ్ళిళ్ళ కన్నా పెళ్ళయాక ప్రేమలే ఉంటాయి.

అలాగే మన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తమ పెద్దవాళ్ళు నిర్ణయించిన అమ్మాయినే పెళ్లి చేసుకునే వారు.. అంతెందుకు తమతో పాటే చిన్నప్పటి నుండి పెరిగిన తమ సొంత మరదళ్ళనే పెళ్లి చేసుకునేవారు. అలా తమ సొంత కజిన్స్ ని పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న హీరోస్ ఎవరో ఒకసారి చూద్దాం.

మొదటగా సూర్య తమ్ముడు కార్తీ. ఇటీవలే “ఖైదీ” సినిమాతో తెలుగులో తనదైన మార్కెట్ ని పెంచుకున్న కార్తీ తన సొంత మరదలు రజినిని పెద్దలు నిశ్చచాయించగా పెళ్లి చేసుకున్నాడు. రజిని MA లిటరేచర్ లో గోల్డ్ మెడలిస్ట్. వీరికిఒక కుమార్తె ఉంది.

మరొక సౌత్ ఇండియన్ హీరో శివ కార్తికేయన్ సైతం తన మామ కూతురు అయిన ఆర్తీ ని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు కూడా ఉంది.

ఇక మన సీనియర్ ఎన్టీఆర్ సైతం తన మామ కూతురు అయిన బసవతారకంని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి నాటికి ఎన్టీఆర్ ఆస్తులు కరిగిపోగా ఆయనపై ఇష్టం తోనే బసవతారకం పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇక వీరి జీవితం గురించి ఇప్పటికే సినిమా సైతం వచ్చిన విషయం తెలిసిందే.

మరో స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు సైతం తన మరదలైన అన్నపూర్ణ ని పెళ్లి చేసుకున్నాడు, మొదట్లో పెళ్ళికి అంగీకరించని అన్నపూర్ణమ్మ కుటుంబం ఆ తర్వాత ఒప్పుకొని అక్కినేనికి ఇచ్చి వివాహం చేసారు.

ఇక నాటి హీరోల్లో మరదలిని పెళ్లాడిన మరొక హీరో కృష్ణ. ఆదాల పుత్తడి బొమ్మ ఇందిరమ్మను కృష ఎంతో ఇష్టపడి మరి పెళ్లి చేసుకున్నాడు. కృష్ణ కి ఇందిరా స్వయానా మామ కూతురు. సినిమాల్లో నటిస్తున్న క్రమంలో విజయ నిర్మలను ప్రేమించి పెళ్లాడిన ఇందిరతో సైతం ఆయన ఎంతో సఖ్యతతో ఉండేవారు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం మరదలైన నిర్మల దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. మోహన్ బాబు మొదటి భార్య విద్య దేవికి నిర్మల స్వయానా చెల్లెలు. లక్ష్మి విష్ణు పుట్టాక ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో నిర్మలను పిల్లల కోసం పెళ్లి చేసుకున్నారు మోహన్ బాబు వీరికి మంచు మనోజ్ ఒక్కడే సంతానం.

ఇక నేటి తరం నటుల్లో ఒక్క సాయి కుమార్ కొడుకు ఆది తప్ప ఇలా మరదళ్ళని పెళ్లి చేసుకున్న వారు నిజానికి లేరు అనే చెప్పుకోవాలి. సాయి కుమార్ భార్య తమ్ముడు కుమర్తెనే ఆది పెళ్లి చేసుకున్నాడు. చిన్న నాటి నుండే వీరికి పెళ్లి చేయాలనీ ఇరు కుటుంబ సభ్యులు భావించడం, అలాగే ఆది మరియు అరుణాలకు కూడా ఒకరంటే ఒకరు ఇష్టం ఉండటంతో వీరి పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమార్తె అనన్య కూడా ఉంది.

ఏది ఏమైనా మన తెలుగు ఇండస్ట్రీలో నాటి రోజుల్లో మాత్రమే ఇలా బంధువుల అమ్మాయిని లేదంటే మరదలిని పెళ్లి చేసుకున్నారు. రాను రాను ఈ పద్ధతి కనుమరుగయిపోతుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

2 hours ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

2 hours ago

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

3 hours ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

4 hours ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

4 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

4 hours ago