Ashish Reddy: ప్రస్తుతం పెళ్లిల సీజన్ కావడంతో ఎంతోమంది పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు కూడా పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితోపాటు పలువురు టాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పెళ్లిళ్లు చేసుకున్నారు.
త్వరలోనే మరో టాలీవుడ్ హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమారుడిగా ఇండస్ట్రీలోకి రౌడీ బాయ్స్ అనే సినిమా ద్వారా అడుగు పెట్టారు హీరో ఆశిష్ రెడ్డి. రౌడీ బాయ్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈయన త్వరలోనే సెల్ఫిష్ అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా ఆశిష్ రెడ్డి నిశ్చితార్థం జరుపుకున్నారని తెలుస్తోంది.
ఈయన ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అద్వైత రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ ఫోటోలు చూసి యంగ్ హీరోకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ నిశ్చితార్థకు వేడుక కేవలం కుటుంబ సభ్యులు సమక్షంలో మాత్రమే జరిగిందని తెలుస్తుంది.
ఫిబ్రవరిలో పెళ్లి…
ఇలా గురువారం సాయంత్రం ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఆశిష్ అద్వైత రెడ్డిల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ జంట ఫిబ్రవరి నెలలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆశిష్ తన సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…