ఒకప్పుడు హీరోలుగా సినీ పరిశ్రమను శాసించిన వారంతా కాలక్రమంలో వయస్సు పైబడిన కొద్ది హీరో స్థాయినుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎన్టీ రామారావు వేటగాడు, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, బొబ్బిలిపులి లాంటి సినిమాల్లో నటించినప్పటికీ ఆయన రాజకీయాల్లో చేరడంతో సినిమాలను పూర్తిగా తగ్గించుకున్నారు.
ఎన్టీఆర్ చనిపోయే దశలో మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఓ క్యారెక్టర్ రోల్ చేయడం జరిగింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
1980 దశకంలో ప్రేమాభిషేకం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు కొన్ని సినిమాల్లో హీరోగా చేసినప్పటికీ ఆ తర్వాత కాలంలో బ్రహ్మ రుద్రులు, అగ్నిపుత్రుడు, ఇద్దరూఇద్దరే, కలెక్టర్ గారి అబ్బాయి, సీతారామయ్య గారి మనవరాలు, మెకానిక్ అల్లుడు, బంగారు కుటుంబం, గాండీవం శ్రీరామదాసు, శ్రీ రామ రాజ్యం, మనం లాంటి చిత్రాల్లో ఆయన నటించారు.
1990 ప్రథమార్ధం వరకు అందాల నటుడు శోభన్ బాబు హీరోగా నెట్టుకు వచ్చినప్పటికీ ఆ తర్వాత క్యారెక్టర్స్ రోల్స్ చేయలేక తప్పలేదు. అలా సర్పయాగం, బలరామకృష్ణులు, దోషి నిర్దోషి, అశ్వమేధం లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది. రెండువేల దశకం వచ్చేసరికి శోభన్ బాబు పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. హీరోగా నటించిన తర్వాత టూటౌన్ రౌడీ, నేటి సిద్ధార్థ బావ బావమరిది, బిల్లా, రుద్రమదేవి, రెబల్ లాంటి చిత్రాల్లో కారెక్టర్ రోల్స్ చేశారు. అయితే ఈయన రాజకీయాల్లోకి వెళ్లడంతో పూర్తిగా సినిమాలను తగ్గించుకున్నారు.
1990 ప్రారంభ దశలో సూపర్ స్టార్ కృష్ణ నాగాస్త్రం, అల్లుడు దిద్దిన కాపురం, పచ్చనిసంసారం,రౌడీ అన్నయ్య లాంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. 1994 లో వచ్చిన నెంబర్ వన్ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. కృష్ణ తర్వాత రోజుల్లో సుల్తాన్, ఒసేయ్ రాములమ్మ, బలాదూర్ సుకుమారుడు, సేవకుడు లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది. ఈయన వయసు పూర్తిగా పైబడటం తో సినిమాలకు కు దూరంగా ఉన్నారని చెప్పవచ్చు. అలా ఒకప్పుడు సినీ పరిశ్రమలో ఒక ఊపు ఊపిన హీరోలందరూ మలిదశలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమ సత్తా చాటారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…